IPL 2022 TILAK VERMA NEWS MUMBAI INDIANS BATTER TILAK VERMA MASSIVE RUNS AGAINST ASHWIN AND CHAHAL IN IPL SJN
IPL 2022: ఈ తెలుగు కుర్రాడిలో చాలా సత్తా ఉంది గురూ.. అశ్విన్, చహల్ బౌలింగ్ ను చితక్కొట్టడం మామూలు విషయం కాదు కదా?
తిలక్ వర్మ
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ప్రతిభ గల మరో కుర్రాడిని ప్రపంచం ముందు నిలబెట్టింది. దేశవాళి టోర్నీలు అయిన రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే లాంటి వాటిలో టన్నుల కొద్ది పరుగులు సాధించినా రాని గుర్తింపు... ఐపీఎల్ లో కేవలం రెండే రెండు ఇన్నింగ్స్ లతోనే వచ్చేసింది.
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ప్రతిభ గల మరో కుర్రాడిని ప్రపంచం ముందు నిలబెట్టింది. దేశవాళి టోర్నీలు అయిన రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే లాంటి వాటిలో టన్నుల కొద్ది పరుగులు సాధించినా రాని గుర్తింపు... ఐపీఎల్ లో కేవలం రెండే రెండు ఇన్నింగ్స్ లతోనే వచ్చేసింది. మొన్న ఆయుశ్ బదోని రూపంలో యువ స్టార్ క్రికెటర్ పరిచయం అయితే... తాజాగా హైదరాబాద్ కుర్రోడు తిలక్ వర్మ (Tilak verma) తన ఎంట్రీని ఐపీఎల్ లాంటి బిగ్ స్టేజ్ పై ఘనంగా చాటుకున్నాడు. మెగా వేలంలో తిలక్ వర్మ ను పోటీ పడీ మరీ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) దక్కించుకుంది. అతడి కోసం ఏకంగా రూ. 1.7 కోట్లను వెచ్చించింది.
తిలక్ వర్మ గురించి పెద్దగా తెలియని వారు ఎవరా క్రికెటర్... అతడిపై అంత ఖర్చు పెట్టడం అవసరమా? అనే ధోరణిలో మాట్లాడారు కూడా. అయితే అతడి ఆటను చూసిన వారికి మాత్రం... అలా అస్సలు అనిపించలేదు. ఎందుకంటే తిలక్ వర్మ బ్యాట్ పడితే ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వారికి తెలుసు కాబట్టి. ఇప్పుడు తిలక్ అదే చేసి చూపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన అతడు 15 బంతుల్లో 22 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. ఇక శనివారం రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అయితే తనలో భారీ ఇన్నింగ్స్ లు ఆడే ప్లేయర్ ఉన్నాడని అందరికీ తెలియజేశాడు.
194 పరుగుల భారీ లక్ష్యం... 40 పరుగులకే 2 వికెట్లు... తిలక్ వర్మ క్రీజులోకి వచ్చే సమయానికి ముంబై ఇండియన్స్ పరిస్థితి. ముందు నెమ్మదిగా ఆడిన అతడు కుదురుకున్నాక రెచ్చిపోయాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ చేసే తీరును చూసిన ఇషాన్ కిషన్... స్ట్రయిక్ రొటేట్ చేయడానికే సిద్ధం కావడం విశేషం. ఈ మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే 3 ఫోర్లు 5 సిక్సర్లతో 61 పరుగులు సాధించాడు. బంతి టర్న్ అవుతున్న పిచ్ పై... అద్భుత షాట్లతో అలరించాడు. ఈ క్రమంలో అతడు ప్రపంచంలోనే ఇద్దరు టాప స్పిన్నర్లను ఎదుర్కొన్నాడు. ఎదుర్కొోవడం ఏంటి... వాళ్లను ఉతికి ఆరేశాడు. రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్ స్పిన్ దిగ్గజాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తిలక్ వర్మ వారి బౌలింగ్ ను ఎదుర్కొన్న తీరు చూడ ముచ్చటగా ఉంది. అశ్విన్ స్పెల్ లో 10 బంతులు ఎదుర్కొన్న తిలక్ ఏకంగా 19 పరుగులు చేశాడు. ఇక చహల్ స్పెల్ లో 12 బంతులు ఆడి 21 పరుగులు చేశాడు.
ఇక అశ్విన్ బౌలింగ్ లో స్విచ్ హిట్ ద్వారా ఫైన్ లెగ్ దిశలో కొట్టిన సిక్సర్ తిలక్ వర్మలోని ఫియర్ లెస్ క్రికెటర్ ను చూపిస్తోంది. అయితే అనంతరం కమ్ బ్యాక్ చేసిన అశ్విన్ అద్భుత బంతితో తిలక్ వర్మను అవుట్ చేశాడు. అప్పుడు అశ్విన్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు. అప్పుడెప్పుడో 2014లో మ్యాక్స్ వెల్ అవుట్ చేసినప్పుడు అశ్విన్ ఈ విధంగా సంబరాలు చేసుకున్నాడు. అంటే... తిలక్ వర్మ వికెట్ తీయడాన్ని అశ్విన్ గొప్పగా భావించినట్లే కదా... 19 ఏళ్ల వయసులో మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు దక్కిన గొప్ప గౌరవంగా మనం దీనిని భావించొచ్చు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.