క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌కు సమయం దగ్గరపడింది. భారత్ వేదికగానే ఈ క్యాష్ రిచ్ లీగ్ జరుగుతున్నా.. కరోనా కారణంగా ఈ సారి లీగ్‌ను ముంబై, పుణేలకే పరిమితం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, పుణేలోని ఎంసీఏ మైదానాల్లోనే లీగ్ మొత్తం జరగనుంది. ఫైనల్‌తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 26 నుంచి మే 29 వరకు ఈ లీగ్ అభిమానులను అలరించనుంది. ఈ సారి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మొత్తం పది జట్లతో మ్యాచ్‌ల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లకు పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతివ్వనున్నారు. తొలుత ఖాళీ మైదానాల్లో నిర్వహించాలని భావించినా.. ప్రస్తుతం భారత్ (India)లో కరోనా పరిస్థితులు అదుపులో ఉండటంతో 25 శాతం ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించారు. దాదాపు రెండేళ తర్వాత ప్రేక్షకులను అనుమతిస్తుండటం, పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉండటంతో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ఇక, ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లకి సంబంధించిన టికెట్లని ఆన్లైన్లో బీసీసీఐ (BCCI) మార్చి 23న విడుదల చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. మే 22 వరకూ మొత్తం 70 లీగ్ దశ మ్యాచ్‌లు జరనున్నాయి. ఈ మేరకు టికెట్లని బుధవారం మధ్యాహ్నం నుంచి బీసీసీఐ అందుబాటులోకి తెచ్చింది. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఇంకా ప్లే ఆఫ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని బీసీసీఐ విడుదల చేయలేదు.
టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే..?
Step 1: అఫిషియల్ వెబ్సైట్ www.iplt20.comలోకి వెళ్లాలి. లేదా https://in.bookmyshow.com/లోనూ అందుబాటులో ఉన్నాయి.
Step 2: మెనూ బార్‌లోని బై టికెట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Step 3: కావాల్సిన మ్యాచ్ టికెట్లను ఎంచుకొని కావాల్సిన వివరాలు నమోదు చేయాలి.
Step 4: ఎన్ని టికెట్లు కావాలో వాటికి తగ్గ ధరను ఆన్లైన్ పేమెంట్ మోడ్‌లోనే చెల్లించాలి.
Step 5: పేమెంట్ పూర్తయిన తర్వాత టికెట్స్‌కు సంబంధించిన పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
Step 6 : ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్‌కు సబంధించిన స్క్రీన్ షాట్ లేదా ప్రింటౌట్ను మ్యాచ్‌కు తీసుకెళ్లాలి.
టికెట్స్ ధరలివే..
వాంఖడే స్టేడియం : రూ. 2500 నుంచి రూ.4500 వరకు
బ్ర బౌర్న్ స్టేడియం : రూ. 3000 నుంచి రూ.3500 వరకు
డివై పాటిల్ స్టేడియం : రూ. 800 నుంచి రూ. 2500 వరకు
పుణె ఎంసీఏ స్టేడియం : రూ. 1000 నుంచి రూ. 8000 వరకు
కండీషన్స్ అప్లై..
ఓవరాల్‌గా ఈ ఏడాది లీగ్ దశలో 12 డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉన్న రోజుల్లో ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకి, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకి ప్రారంభంకానుంది. అయితే మైదానంలోకి వచ్చే అభిమానులు కరోనా రూల్స్‌ను కచ్చితంగా పాటించాలని సూచించింది. మైదానంలోనూ కరోనా ప్రోటోకాల్స్ అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారినే మైదానంలోకి అనుమతించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక ఈ నెల 26న జరగున్న తొలి మ్యాచ్‌లో గత సీజన్లో ఫైనల్ చేరిన కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నైసూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians