IPL 2022 THIS IS WHY MS DHONI CALLED AS ALL TIME BEST CAPTAIN IN CRICKET HISTORY SJN
IPL 2022: ఈ లక్షణమే ధోనిని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలిపేది.. అదేంటంటే?
ధోని ( CSK Twitter)
IPL 2022: ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. జార్ఖండ్ (jharkhand) నుంచి టీమిండియా (Team India)కు ఎంపికైన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) డైనమైట్ లా పేలాడు. అతి తక్కువ కాలంలోనే జార్ఖండ్ డైనమైట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 2007 వన్డే ప్రపంచకప్ (World Cup)లో చేదు అనుభవం తర్వాత దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత జట్టుకు సారథిగా ఎంపికైన ధోని.. ఎవరూ ఊహించని విధంగా జట్టుకు కప్పు అందించాడు.
IPL 2022: ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. జార్ఖండ్ (jharkhand) నుంచి టీమిండియా (Team India)కు ఎంపికైన మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) డైనమైట్ లా పేలాడు. అతి తక్కువ కాలంలోనే జార్ఖండ్ డైనమైట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 2007 వన్డే ప్రపంచకప్ (World Cup)లో చేదు అనుభవం తర్వాత దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో భారత జట్టుకు సారథిగా ఎంపికైన ధోని.. ఎవరూ ఊహించని విధంగా జట్టుకు కప్పు అందించాడు. అనంతరం వన్డే, టెస్టుల్లోనూ సారథిగా బాధ్యతలు చేపట్టిన ధోని అద్బుతాలు సృష్టించాడు. భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ లో టీమిండియాను చాంపియన్ గా నిలిపి దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్ ను విశ్వ విజేతగా నిలిపాడు. అయితే 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ లు కేవలం ధోని వల్లే రాలేదని.. యువరాజ్ సింగ్ (Yuvraj Singh), గౌతమ్ గంభీర్ (gautam gambhir) లాంటి ప్లేయర్లు కూడా కారణమేనే వాదన అప్పుడప్పుడు వినిపిస్తోంది. అవును.. యువరాజ్, గంభీర్ ఆడకుంటే అటు టి20 కానీ ఇటు వన్డే ప్రపంచకప్ లు భారత్ కు వచ్చేది కష్టమే. కాకపోతే జట్టును ఏకతాటిపైన నడిపిన ఘనత మాత్రం ధోనికే దక్కుతుంది.
క్రికెట్ లో ధోని కంటే గొప్ప కెప్టెన్లు ఉండొచ్చు. కానీ, ధోనిలోని ఒక లక్షణం వారందరి కంటే కూడా భిన్నంగా ఉంచగలుగుతుంది. అదే.. ఆటగాళ్లపై నమ్మకం ఉంచడం. వారు విఫలమవుతున్నా వారికి అవకాశాల మీద అవకాశాలను ఇస్తూ వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంచి వారి నుంచి అద్భుత ప్రదర్శనను వెలికితీయడంలో ధోని తర్వాతే ఎవరైనా. ఉదాహరణకు ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ నే తీసుకుంటే.. మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు ముఖేశ్ చౌదరి. ఈ సీజన్ లో కేకేఆర్ తో మినహా ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ ల్లోనూ ముఖేశ్ చౌదరి ఆడాడు.
ఆరంభంలో అతడు ఆడిన తొలి నాలుగు మ్యాచ్ ల్లోనూ దారుణంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో అయితే అతడు రెండు క్యాచ్ లను డ్రాప్ కూడా చేశాడు. వేరే కెప్టెన్ అయితే ముఖేశ్ చౌదరి ప్రదర్శన తర్వాత అతడికి మరో అవకాశం ఇచ్చేది కష్టమే. కానీ, ధోని అలా చేయలేదు. అతడికి అవకాశాల మీద అవకాశాలు ఇచ్చాడు. అందుకు కారణం... అతడు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడమే. దీపక్ చహర్ లాంటి ప్లేయర్ గాయంతో దూరం అవ్వడంతో ధోనికి పవర్ ప్లేలో వికెట్లు తీసే బౌలర్ కావాలి. అందుకు కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్ చేసే బౌలర్ ధోనికి కావాలి. ముఖేశ్ చౌదరి బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. కానీ, దారాళంగా పరుగులు సమర్పించుకునేవాడు. అయినా ధోని అతడి మీద నమ్మకం ఉంచాడు.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో దారుణంగా విఫలమైనా ముఖేశ్ ను గుజరాత్ తో జరిగిన మ్యాచ్ కోసం తుది జట్టులో తీసుకున్నాడు. అక్కడ మూడు ఓవర్లు వేసిన అతడు 18 పరుగులు ఇచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముఖేశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రోహిత్ లాంటి బ్యాటర్ ను స్లో డెలివరీతో అవుట్ చేసిన అతడు.. అదే ఓవర్ లో సూపర్ యార్కర్ తో ఇషాన్ కిషన్ పని పట్టాడు. ఆ తర్వాత డివాల్డ్ బ్రేవిస్ వికెట్ కూడా తీశాడు. బౌలింగ్ తోనే కాదు ఫీల్డింగ్ లోనూ ముఖేశ్ చౌదరి మెరిశాడు. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ను అందుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ముఖేశ్ చౌదరి ని చూస్తే అసలు ఇతడికి ఎందుకు అవకాశం ఇస్తున్నారని ఆగ్రహించిన చెన్నై ఫ్యాన్సే ఇప్పుడు ముఖేశ్ చౌదరిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఒక్క ముఖేశ్ చౌదరి విషయంలోనే కాదు.. రుతురాజ్, జడేజా, అశ్విన్, సురేశ్ రైనా ల విషయంలోనూ ధోని ఇదే విధంగా ఉన్నాడు. వీరు తమ కెరీర్ ఆరంభంలో విఫలమైనా చాన్స్ లు ఇస్తూ వారి నుంచి అద్భుత ప్రదర్శనలను బయటకు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.