Home /News /sports /

IPL 2022 THESE ARE THE REASONS FOR MUMBAI INDIANS AND CHENNAI SUPER KINGS HATTRICK DEFEATS SRD

IPL 2022 : గతమెంతో ఘనం.. కానీ ప్రస్తుతం శూన్యం.. ముంబై, చెన్నై జట్లు ఫెయిలవ్వడానికి కారణాలివేనా..!

Chennai Super Kings - Mumbai Indians

Chennai Super Kings - Mumbai Indians

IPL 2022 : గతమెంతో ఘనం.. కానీ ప్రస్తుతం శూన్యం.. ప్రస్తుతం ముంబై, చెన్నై జట్లకి ఈ మాట వర్తిస్తోంది. ఈ రెండు జట్లు హ్యాట్రిక్ ఓటములతో ఈ సీజన్ లో బ్రీ గేడ్ టీమ్స్ లా కన్పిస్తున్నాయ్.

  ఐపీఎల్ చరిత్రలో ఆ రెండు అత్యంత విజయవంతమైన జట్లు. ఒక జట్టు ఐదుసార్లు ఐపీఎల్​ ఛాంపియన్​.. మరొకటి డిఫెండింగ్​ ఛాంపియన్​ సహా నాలుగు టైటిళ్లు గెల్చుకున్న టీమ్​. అవే ముంబై ఇండియన్స్ (Mumbai Indians)​, చెన్నై సూపర్​ కింగ్స్ (Chennai Super Kings)​. ప్రస్తుత ఐపీఎల్​లో చెరో 3 మ్యాచ్​లు ఆడిన ఈ జట్లు ఇంకా ఖాతా తెరవలేదు. దీంతో ఈ జట్ల ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంటే, 8వ స్థానంలో సీఎస్కే ఉంది. ఈ జట్ల పరిస్థితి చూస్తుంటే ఈ సారి కష్టమే అన్నట్టు ఉంది. రెండు కొత్త జట్ల రాక ఐపీఎల్ జట్ల స్వరూపాలు మారిపోవడానికి దారితీసిందని చెప్పుకోవాలి.
  మెగా వేలానికి ముందు ప్రతి జట్లు ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను ఉంచుకుని మిగిలిన వారిని విడుదల చేయాలని ఐపీఎల్ యాజమాన్యం కోరింది. దీంతో ముంబై ఇండియన్స్, సీఎస్కే తమకు ముఖ్యమైన ఆటగాళ్లను కొందరిని ఉంచుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. తర్వాత వేలంలోనూ కావాల్సిన వారిని దక్కించుకోలేకపోయాయి. దీంతో, రెండు జట్లు చెల్లాచెదురయ్యాయ్.

  ఇక తీసుకున్న ఆటగాళ్లలోనూ కొందరు గాయాలతో దూరం కావడం ముంబై, చెన్నై జట్లకు శాపంగా మారింది. ముంబై ఇండియన్స్ పాండ్యా సోదరులను కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ గాయం వల్ల మొదటి రెండు మ్యాచులకు దూరం అయ్యాడు. గాయం వల్లే జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం లేదు.

  చెన్నై జట్టుకు గత సీజన్ లో టైటిల్ విజయంలో కీలకంగా పనిచేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమయ్యాడు. వేలంలో రూ.14 కోట్లు ధారపోసి మరీ అతడ్ని సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ, అతడు మొదటి మూడు మ్యాచులకు అందుబాటులోకి రాలేదు. గతేడాది టైటిల్ విన్నింగ్ లో కీ రోల్ ప్లే చేసిన ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి రాలేదు. దీనికి తోడు ధోనీ సారథ్యం వదిలేయడం, ఆ బాధ్యతలు జడేజా ఎత్తుకోవడం తెలిసిందే.

  ముంబై జట్టు ఆడే విధానం, పరిస్థితులు మునుపటిలా లేవు. జట్టు పూర్తిగా మారిపోయింది. బ్యాటింగ్​లో కొరత లేకపోయినప్పటికీ.. బౌలింగ్​లో చాలా బలహీనంగా కనిపిస్తోంది. గతంలో బుమ్రా, బౌల్ట్​, కృనాల్​, రాహుల్​ చాహర్​తో బలంగా కనిపించే బౌలింగ్​ లైనప్​ ఈసారి లేదు.


  బుమ్రాకు సహకారం అందించే మరో బౌలర్​ కరవయ్యాడు.పేసర్లు టైమల్​ మిల్స్​, డేనియల్​ సామ్స్​, బాసిల్​ థంపి ధారాళంగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. బౌలింగ్​లో మెరుగుపడకుంటే ఈసారి ముంబై ప్లేఆఫ్స్​ చేరడం కష్టమే అని చెప్పొచ్చు.

  ఇక, చెన్నై జట్టు కూడా బౌలింగ్​లో మరీ తీసికట్టుగా కనిపిస్తోంది. డ్వేన్​ బ్రావో ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్​ చేస్తున్నాడు. పెద్దగా అనుభవం లేని ముకేశ్​ చౌదరి సహా జడ్డూ, జోర్డాన్​ కూడా భారీగా పరుగులు ఇస్తున్నాడు. ప్రిటోరియస్​ రాకతో కాస్త బలపడ్డట్లు కనిపించినా.. మిగతావారి నుంచి అతడికి సహకారం లభించట్లేదు. ఇలాంటి లైనప్ తో చెన్నై జట్టు ముందుకెళ్లడం కష్టమే అన్నట్టుగా మారింది.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chennai Super Kings, Cricket, IPL 2022, Mumbai Indians, Ravindra Jadeja, Rohit sharma

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు