హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : అంతా తూచ్.. అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. కొత్త పేరు ఇదే..!

IPL 2022 : అంతా తూచ్.. అహ్మదాబాద్ టైటాన్స్ కాదు.. కొత్త పేరు ఇదే..!

IPL 2022 : లక్నో ప్రాంచైజీ తమ జట్టుకు 'లక్నో సూపర్ జెయింట్స్' (Lucknow Super Giants) అని నామకరణం చేయగా.. లేటెస్ట్ గా అహ్మదాబాద్ ప్రాంచైజీ కూడా తన జట్టు పేరును ప్రకటించింది.

IPL 2022 : లక్నో ప్రాంచైజీ తమ జట్టుకు 'లక్నో సూపర్ జెయింట్స్' (Lucknow Super Giants) అని నామకరణం చేయగా.. లేటెస్ట్ గా అహ్మదాబాద్ ప్రాంచైజీ కూడా తన జట్టు పేరును ప్రకటించింది.

IPL 2022 : లక్నో ప్రాంచైజీ తమ జట్టుకు 'లక్నో సూపర్ జెయింట్స్' (Lucknow Super Giants) అని నామకరణం చేయగా.. లేటెస్ట్ గా అహ్మదాబాద్ ప్రాంచైజీ కూడా తన జట్టు పేరును ప్రకటించింది.

  ఐపీఎల్ 2022 మెగా వేలాని (IPL 2022 Mega Auction)కి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనున్న ఈ వేలంలో మొత్తంగా 10 ఫ్రాంఛైజీలు పాల్గొననున్నాయి. ఇప్పటికే ఉన్న 8 జట్లతో పాటు కొత్తగా ఫ్రాంఛైజీలు అయిన లక్నో, అహ్మదాబాద్ పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో ప్రాంచైజీ తమ జట్టుకు 'లక్నో సూపర్ జెయింట్స్' (Lucknow Super Giants) అని నామకరణం చేయగా.. లేటెస్ట్ గా అహ్మదాబాద్ ప్రాంచైజీ కూడా తన జట్టు పేరును ప్రకటించింది. త‌మ జ‌ట్టుకు 'గుజరాత్ టైటాన్స్' (Gujarat Titans) అని పేరు పెట్టిన‌ట్లు వెల్ల‌డించింది. సీవీసీ క్యాపిట‌ల్స్ అహ్మ‌దాబాద్ ప్రాంచైజీని కొనుగోలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ శ‌నివార‌మే ఐపీఎల్ మెగా వేలం జ‌ర‌గబోతూ ఉండ‌డంతో సీవీసీ క్యాపిట‌ల్స్ యాజ‌మాన్యం త‌మ జ‌ట్టుకు గుజ‌రాత్ టైటాన్స్‌గా పేరును ఖ‌రారు చేసింది. ఐపీఎల్‌లోకి అరంగేంట్రం చేస్తున్న ఆ జ‌ట్టు గుజ‌రాత్ క్రికెట్ వారస‌త్వాన్ని కొన‌సాగిస్తామ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ భార‌త క్రికెట్‌కు ఎంతో మంది లెజెండ‌రీ ఆట‌గాళ్ల‌ను అందించంద‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది.

  ధైర్యవంతమైన, విశాల హృదయంతో కూడిన జట్టుగా ఉండాల‌ని తాము భావిస్తున్నామ‌ని ఆ జ‌ట్టు సీఈఓ సిద్ధార్థ్ పటేల్ పేర్కొన్నారు. త‌మ జ‌ట్టు గొప్ప గొప్ప విజ‌యాలు సాధించాల‌ని ఆయ‌న ఆశించారు. త‌మ ఫ్రాంచైజీ ప్ర‌ధాన లక్ష్యం ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత స్ఫూర్తిదాయకంగా, అందరినీ కలుపుకొని పోవడమేన‌ని తెలిపారు. దీర్ఘకాలిక విజయాలు, ఖ్యాతిని బలపరిచేందుకు ఇది సహాయపడుతుంద‌ని సిద్దార్థ్ చెప్పుకొచ్చారు. మెగా వేలంలో తాము స‌రైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేస్తామ‌ని విశ్వ‌సిస్తున్న‌ట్లు చెప్పారు. నైపుణ్యం మాత్ర‌మే కాకుండా, ప్రేర‌ణ క‌లిగించే ఆట‌గాళ్ల‌ను త‌మ ఫ్రాంచైజీ కోరుకుంటోంద‌ని సిద్ధార్థ్ పటేల్ పేర్కొన్నారు.

  ఇది కూడా చదవండి : ప్రియుడు కౌగిలిలో సేద తీరుతున్న యువీ మాజీ ప్రేయసి కిమ్ శర్మ..

  అహ్మదాబాద్‌ టైటాన్స్‌ అని పేరు పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని కలిగి ఉంది. సీవీసీ క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5625 కోట్లకు కొనుగోలు చేసింది. అహ్మదాబాద్‌తో పాటు లక్నో ఫ్రాంచైజీ కూడా ఐపీఎల్ 2022లో తొలిసారి ఆడనున్న విషయం తెలిసిందే.

  ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు అహ్మదాబాద్‌ టైటాన్స్‌ హార్దిక్ పాండ్యా (15), ర‌షీద్ ఖాన్‌ (15), శుభ్‌మన్ గిల్‌ (8) కోట్లకు కోనుగొలు చేసింది. అహ్మదాబాద్‌ టైటాన్స్‌ జట్టుకు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా సారథిగా ఎంపికయిన విషయం తెలిసిందే. మెగా వేలంలో పాల్గొని మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది. ఇక ఇదివ‌ర‌కే గుజ‌రాత్ జ‌ట్టు త‌మ కోచింగ్ స్టాఫ్‌ను కూడా ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ విక్రమ్‌ సోలంకీని గుజరాత్‌ టైటాన్స్ త‌మ‌ జ‌ట్టు డైరెక్టర్‌గా నియమించింది. టీమిండియా మాజీ బౌల‌ర్‌ ఆశిష్ నెహ్రాని ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఉండగా, మాజీ ప్రపంచ కప్ విన్నింగ్ కోచ్, దక్షిణాఫ్రికా ఓపెనర్ గ్యారీ కిర్‌స్టన్ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించ‌నున్నారు.

  First published:

  Tags: Ahmedabad, Gujarat, Hardik Pandya, IPL 2022, IPL Auction 2022, Rashid Khan

  ఉత్తమ కథలు