Home /News /sports /

IPL 2022 SUNRISERS HYDERABAD SRH MAY BUY CSK PLAYER SURESH RAINA IN MEGA AUCTION SK

IPL 2022: సన్ రైజర్స్ టీమ్‌లోకి సురేష్ రైనా.. ఎన్ని కోట్లకు కొనబోతున్నారో తెలుసా..?

సురేష్ రైనా

సురేష్ రైనా

Suresh Raina: టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) స్టార్ ప్లేయర్ సురేష్ రైనా (Suresh Raina) ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.

  ఐపీఎల్ టోర్నీ (IPL 2022) ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా.. అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈసారి అహ్మదాబాద్ (Ahmedabad), లక్నో (Lucknow) జట్లు కూడా రావవడంతో టోర్నీ మరింత రసవత్తరంగా మారనుంది. అంతేకాదు ఈ సీజన్‌లో ఆటగాళ్ల విషయంలోనూ ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ఆటగాళ్ల జట్లు మారనున్నాయి. మరో రెండు వారాల్లోనే మెగా వేలం జరగబోతోంది. ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లను ఆయా జట్లు అట్టిపెట్టుకున్నాయి. మిగతా వారిని వేలానికి వదిలిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు ఈసారి వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఎవరు ఏ టీమ్‌లోకి వస్తారో అని ఇప్పటికే నుంచే అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

  ఐతే ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings) స్టార్ ప్లేయర్ సురేష్ రైనా (Suresh Raina) ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad) తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది. మెగా వేలంలో ఎలాగైనా రైనాను కొనుగోలు చేయాలని సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఐపీఎల్‌లో సురేష్ రైనాకు తిరుగులేని రికార్డు ఉంది. మిస్టర్ ఐపీఎల్‌గా అతడికి పేరుంది. ఒంటి చేత్తోనే ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించాడు. సురేష్ రైనా 2008లో ఐపీఎల్ ప్రారంభం నుంచీ ఉండడంతో.. పొట్టి క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉంది. అలాంటి విజయవంతమైన, అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉంటే.. సన్ రైజర్స్ మరింత బలంగా మారుతుందని యాజమాన్యం భావిస్తోందట.

  CSK: చెన్నై సూపర్ కింగ్స్ మ‌రో రికార్డు.. బ్రాండ్ వాల్యూలో యునికార్న్ గ్రూప్‌గా.

  గత సీజన్ వరకు సురేష్ రైనా చెన్నై జట్టులో ఉన్నాడు. ఆరంభం నుంచి మొన్నటి వరకు సీఎస్‌కే సభ్యుడిగా ఉన్నాడు. ఐతే మధ్యలో చెన్నై టీమ్‌పై రెండేళ్లు నిషేధం విధించడంతో.. అప్పుడు గుజరాత్ లయన్ జట్టుకు ప్రతినిధ్యం వహించాడు. ఇక 2020 ఐపీఎల్ సీజన్‌లో వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరంగా ఉన్నాడు సురేష్ రైనా. గత ఏడాది మళ్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేదు. సాధారణంగా సురేష్ రైనా తుది జట్టులో ఖచ్చితంగా ఉండేవాడు. కానీ గత ఏడాది ఆఖరి మ్యాచ్‌ల్లో రైనాకు చోటు దక్కలేదు. ఫామ్‌లో లేని కారణంగా పక్కనబెట్టేశారు. అంతేకాదు చెన్నై రిటెన్షన్ జాబితాలోనూ చోటు దక్కలేదు. ఈసారి ధోనీ, జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకున్న చెన్నై టీమ్.. రైనాను వదులుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి మెగా వేలంలో అతడు పాల్గొననున్నాడు.

  సురేష్ రైనాకు గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ రూ. 11 కోట్ల చెల్లించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. గత ఏడాది రైనా పెద్దగా ఆకట్టుకోలేదు. అంతేకాదు 35 ఏళ్ల వయసున్న రైనా.. ప్రస్తుతం భారత జట్టులో కూడా లేడు. ఈ కారణాల వల్ల.. వేలంలో రైనాకు భారీ ధర రాకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత సీజన్‌లో రైనా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ..అతడికి చాలా అనుభవం ఉందని హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోంది. సరైన సమయంలో మళ్లీ విజృంభిస్తాడని నమ్ముతోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా రైనాను తీసుకోవాలని సన్ రైజర్స్ యోచిస్తోందట. అతడి కోసం రూ.10 కోట్ల వరకైనా సరే ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

  U-19 World Cup: CRPF సైనికుడి కొడుకు స్వింగ్‌లో దున్నేస్తున్నాడు.. టీమిండియాకు కొత్త ఆశా కిరణం

  కాగా, ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లు ఆడాడు సురేష్ రైనా. 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రైనా అత్యధిక స్కోర్ 100 పరుగులు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 506 ఫోర్లు, 206 సిక్స్‌లు బాదాడు సురేష్ రైనా. అప్పుడప్పుడూ బౌలింగ్ కూడా వేసే రైనా.. ఇప్పటి వరకు 25 వికెట్లు పడగొట్టాడు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Cricket, Indian premier league, IPL 2022, IPL Auction 2022, Sun risers hyderabad, Suresh raina

  తదుపరి వార్తలు