Home /News /sports /

IPL 2022 SUNRISERS HYDERABAD RELEASES NEW JERSEY BEFORE MEGA AUCTION SRD

IPL 2022 : పోలా.. అదిరిపోలా.. కొత్త జెర్సీతో ఆరెంజ్ ఆర్మీ.. మరి తలరాత మారేనా..?

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

IPL 2022 : ఐపీఎల్‌-2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లకు గానూ కేవలం మూడింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

  ఐపీఎల్ 2022 (IPL 2022) కోసం బీసీసీఐ (BCCI) వేగవంతగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్యాష్ రీచ్ లీగ్ కోసం ఫ్రాంచైజీలు కూడా సిద్దం అవుతున్నాయి. మ‌రో రెండు రోజుల్లో మెగా వేలం (IPL Mega Auction) ప్రారంభం అవ్వనుంది . ఇక, కొత్త సీజన్ ను స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (Sunrisers Hyderabad) సరికొత్తగా ప్రారంభించాల‌ని డిసైడ్ అయింది. ఇప్పటికే చాలా మంది ఆట‌గాళ్లును కూడా దూరం పెట్టింది. కోచ్ ల‌ను మార్చింది. తాజా గా జెర్సీని కూడా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం మార్చింది. ఐపీఎల్‌-2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు సరికొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నారు. కొత్త జెర్సీని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇంతకు ముందు జెర్సీ పూర్తిగా ఆరెంజ్ రంగుతో ఉండి మ‌ధ్య భాగంలో ఈగల్ ఉండేది. కానీ ఇప్పుడు ఈగల్ ను తీసివేశారు. జెర్సీ మొత్తం ఆరెంజ్ రంగుతోనే ఉంచారు. అలాగే ప్యాంట్ ను కూడా ఆరెంజ్ రంగులోకి మార్చేశారు. ఆరెంజ్ ఆర్మీ అనే పేరుకు త‌గిన‌ట్టుగా జెర్సీని రూపొందించారు. ఇక షర్ట్ కు ఉండే చేతులకు పైన బ్లాక్ కలర్ ఇచ్చి కిందకు వచ్చేసరికి మళ్లీ వాటికి ఆరెంజ్ బార్డర్ వేశారు.

  మొన్నటివరకు హైదరాబాద్ జెర్సీల మీద ‘జేకే లక్ష్మీ సిమెంట్‘ జెర్సీ పార్ట్నర్ గా వ్యవహరించగా తాజాగా ఆ స్థానాన్ని ‘కార్స్ 24’ ఆక్రమించింది. ఇటీవలే కార్స్ 24 సంస్థ.. ఎస్ఆర్హెచ్ తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్. అంతేగాక ఈ సంస్థలో అతడికి పెట్టుబడులు కూడా ఉన్నాయి.

  అయితే, ఐపీఎల్‌-2021 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్‌లకు గానూ కేవలం మూడింట మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించడం సహా తుది జట్టులో కూడా చోటుకల్పించకపోవడంతో విమర్శలు ఎదుర్కొంది.


  ఈ క్రమంలో వరుస ఓటములతో ఆరెంజ్‌ ఆర్మీ నిరాశలో కూరుకుపోయింది. ఇక రిటెన్షన్‌లో భాగంగా వార్నర్‌తో పాటు మరో స్టార్‌ ప్లేయర్‌ రషీద్‌ ఖాన్‌ను కూడా సన్‌రైజర్స్‌ వదిలేసింది.

  ఇది కూడా చదవండి :  Dewald Brevis : మెగావేలానికి ముందు బేబీ డివిలియర్స్ అరుదైన ఘనత.. ఏకంగా సీనియర్లతో పోటీ..!

  కేన్‌ విలియమ్సన్‌ (రూ. 14 కోట్లు), అబ్దుల్‌ సమద్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు), ఉమ్రాన్‌ మలిక్‌ (అన్‌క్యాప్డ్‌ – రూ. 4 కోట్లు)ను అట్టిపెట్టుకుంది. ఇక గత సీజన్‌లో చేదు అనుభవం నేపథ్యంలో ఈసారి పలు మార్పులతో బరిలోకి దిగనుంది. ఇప్పటికే వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారాను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించుకున్న హైదరాబాద్‌... సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంచుకుంది. ఇక, కొత్త జెర్సీతో ఈ ఏడాది ఐపీఎల్ లో ఆరెంజ్ ఆర్మీ తలరాత మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు