Home /News /sports /

IPL 2022 SUNRISERS HYDERABAD NEWS SRH LODGE PROTEST AGAINST THIRD UMPIRE DECISION OVER KANE WILLIAMSON CATCH AGAINST RAJASTHAN ROYALS SJN

IPL 2022: కేన్ మామ క్యాచ్ విషయంలో బీసీసీఐతో తాడో పేడో తేల్చుకునేందుకు సన్ రైజర్స్ సిద్ధం

పడిక్కల్ వివాదాస్పద క్యాచ్

పడిక్కల్ వివాదాస్పద క్యాచ్

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గత నెల 29న రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hydetabad) మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 61 పరుగులతో ఓడిపోయింది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గత నెల 29న రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hydetabad) మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు 61 పరుగులతో ఓడిపోయింది. అయితే ఆ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ (Kane williamson) క్యాచ్ పై థర్డ్ అంపైర్ నిర్ణయంపై పెద్ద దుమారమే లేచింది. ఆ మ్యాచ్ ను చూసిన చాలా మంది క్రికెట్ అభిమానులు... బంతి పడిక్కల్ చేతిలోకి పోకముందే గ్రౌండ్ ను తాకిందంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే థర్డ్ అంపైర్ మాత్రం వేరేలా ఆలోచించి.. కేన్ విలియమ్సన్ ను అవుట్ గా ప్రకటించాడు. ఇప్పుడు ఈ విషయంపై బీసీసీఐ (BCCI)తో తేల్చకునేందుకు సన్ రైజర్స్ జట్టు సిద్ధమైంది. ఈ మేరకు బీసీసీఐకు సన్ రైజర్స్ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

’కేన్ విలియమ్సన్ క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై మేం బీసీసీఐకి ఫిర్యాదు చేశాం. అంతేకాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత రిఫరీకి కూడా కేన్ విలియమ్సన్ ఫిర్యాదు చేశాడు. ఏ రకంగా చూసినా అది నాటౌట్. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఎలా అవుట్ గా ఇచ్చాడనేది అర్థం కావడం లేదు.‘ అని సన్ రైజర్స్ అధికారి ఒకరు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్ సైట్ క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఆ మ్యాచ్ లో... ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (2) షాట్ ఆడే ప్రయత్నం చేయగా... బంతి ఎడ్జ్ తీసుకుని కీపర్ కు సమీపంగా వెళ్లింది. సంజూ సామ్సన్ (sanju samson) తన కుడివైపుకు డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేయగా బంతి కాస్తా... అతడి గ్లౌజ్ నుంచి బౌన్స్ అయ్యింది.

అదే సమయంలో ఫస్ట్ స్లిప్ లో ఉన్న దేవదత్ పడిక్కల్ బంతి నేలను తాకే లోపు క్యాచ్ ను అందుకునే ప్రయత్నం చేశాడు. రియల్ టైమ్ లో అతడు క్యాచ్ ను తీసుకున్నట్లే కనిపించింది. అయినప్పటికీ క్యాచ్ పై అనుమానం పడ్డ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ కు నివేదించారు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ గా వ్యవహరిస్తున్న అనంత పధ్మనాభం క్యాచ్ ను రీప్లేలో పలుమార్లు పరిశీలించాడు. తొలుత చూసిన యాంగిల్ లో క్యాచ్ పై స్పష్టత రాకపోవడంతో మరో యాంగిల్ లో చూశాడు. అందులో బంతి పడిక్కల్ చేతిలోకి చేరకముందే నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ విలియమ్సన్ ను అవుట్ గా ప్రకటించాడు. మ్యాచ్ చూసిన చాలా మంది అది నాటౌట్ అంటూ అభిప్రాయపడ్డారు కూడా.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, IPL, IPL 2022, Kane Williamson, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు