హోమ్ /వార్తలు /క్రీడలు /

Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు SRHకు దారేది.. లెక్కలు ఏం చెబుతున్నాయ్.. ఇక, ఒక్క మ్యాచ్ ఓడినా గోవిందా..!

Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు SRHకు దారేది.. లెక్కలు ఏం చెబుతున్నాయ్.. ఇక, ఒక్క మ్యాచ్ ఓడినా గోవిందా..!

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad : IPL 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఓటములు పరంపర కొనసాగుతూనే ఉంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో ఆరంభమైన ఈ పరాజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో, ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే SRH ఏం చెయ్యాలంటే..

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2022 (IPL 2022)వ సీజన్ లీగ్ స్టేజీ హోరాహోరీగా సాగుతోంది. నెల రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ప్రతి జట్టు కూడా దాదాపు 11 మ్యాచ్ లు ఆడేశాయి. మరో రెండు మూడు వారాల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) , గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రూపంలో రెండు కొత్త జట్లు అడుగుపెట్టాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు గ్రూప్ టేబుల్ లో టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి.

  గుజరాత్, లక్నోలు ఒక విజయాన్ని సొంతం చేసుకుంటే.. ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటాయ్. అయితే, సన్ రైజర్స్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి వల్ల సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకాస్త సంక్లిష్టం అయ్యాయి. ఇక సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరాలంటే ఏం చేయాలో ఓ లుక్కేద్దాం.

  IPL 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఓటములు పరంపర కొనసాగుతూనే ఉంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో ఆరంభమైన ఈ పరాజయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం వాంఖడే వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చెత్తాటతో ఆరెంజ్ ఆర్మీ సహనాన్ని పరీక్షించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 67 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దాంతో గతంలో ఎదురైన ఓటమికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. సన్ రైజర్స్ కు సీజన్ లో ఇది ఆరో ఓటమి. తాజా ఓటమి మన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ మ్యాచ్ ఓటమితో సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ కూడా మైనస్ లోకి వెళ్లింది. ఇప్పుడు ఇది కూడా కీలకంగా మారింది.

  సన్ రైజర్స్ ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడి 6 మ్యాచ్‌ల్లో ఓడింది. 5మ్యాచ్‌లు గెలిచింది. ఇంకా మూడు మ్యాచ్‌లు సన్ రైజర్స్ ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌లు సన్ రైజర్స్‌కు కీలకం. ఇందులో తప్పకుండా 3 మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లేఆఫ్ చేరడానికి సన్‌రైజర్స్ కు అవకాశముంటుంది. అలాగే ఒక్క మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపడి మిగతా జట్లతో క్లాష్ కాకుండా ఉంటుంది.

  సన్ రైజర్స్ కు మిగిలి ఉన్న మూడు మ్యాచ్‌ల్లో ముంబై తప్పా కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మూడు జట్లు ప్లేఆఫ్ రేసు కోసం పోటీలో ఉన్నవే. కేకేఆర్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ జట్టు 8 పాయింట్లతో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్.. 11 మ్యాచుల్లో 5 గెలిచి.. ప్రస్తుతం 10 పాయింట్లతో కొనసాగుతోంది.

  ఇది కూడా చదవండి : పాక్ స్టార్ బౌలర్ అయితే నాకేంటి.. నాలుగో సెంచరీతో దుమ్మురేపిన పుజారా.. (వీడియో)

  పంజాబ్ కింగ్స్ కు ఇంకా మూడు మ్యాచ్‌లు ఉన్నా నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. అందువల్ల ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడినా దాదాపు ప్లేఆఫ్ నుంచి తప్పుకున్నట్లే. దీన్ని బట్టి కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జయాపజయాలు సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరుకోవడానికి చాలా కీలకం. మరోవైపు, ముంబై ఇండియన్స్ ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. గత రెండు మ్యాచులు గెలిచి.. మిగతా జట్ల ప్లే అవకాశాల్ని దెబ్బతీస్తోంది. ఈ క్రమంలో ప్లే ఆఫ్ రేస్ కు చేరుకోవాలంటే మిగతా మూడు మ్యాచుల్లో కచ్చితంగా సన్ రైజర్స్ గెలవాల్సిందే. అందులో ఒక మ్యాచ్ భారీ తేడాతో గెలిస్తే.. అవకాశాలు ఇంకా మరింత మెరుగుపడతాయ్.

  ఇది కూడా చదవండి : అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో.. కోహ్లీ మూడో గోల్డెన్ డకౌట్.. ఇంత చెత్తాట ఎన్నడూ చూడలే..

  లక్నో, గుజరాత్ జట్లు 16పాయింట్లు సాధించి టాప్ రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయ్. ఇంకో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్ చేరతాయ్. ఒకవేళ అన్ని మ్యాచ్‌లు ఓడిపోయినా.. గుజరాత్, లక్నో రన్ రేట్ ప్రకారం.. ప్లేఆఫ్ చేరడం దాదాపు ఖరారే. ఇప్పటికే ఆర్ఆర్, ఆర్సీబీ 14 పాయింట్ల మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయ్. దీంతో, నెట్ రన్ రేట్ సన్ రైజర్స్ కు కీలకం కానుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Mumbai Indians, Rajasthan Royals, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad

  ఉత్తమ కథలు