Home /News /sports /

IPL 2022 SUNRISERS HYDERABAD FIGHTING FOR PLAYOFF RACE HERE CALCULATIONS AND EQUATIONS SRD

IPL 2022 - Sunrisers Hyderabad : హ్యాట్రిక్ ఓటములతో మారిన లెక్కలు.. ఇలా ఆడితే SRH ప్లే ఆఫ్ చేరడం ఖాయం..!

Sunrisers Hyderabad

Sunrisers Hyderabad

IPL 2022 - Sunrisers Hyderabad : హ్యాట్రిక్ ఓటములతో SRH ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయ్. ప్లే ఆఫ్ చేరాలంటే ఆరెంజ్ ఆర్మీ లెక్కలెంటో ఓ లుక్కేద్దాం.

    ఐపీఎల్ 2022 (IPL 2022)వ సీజన్ లీగ్ స్టేజీ హోరాహోరీగా సాగుతోంది. నెల రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ప్రతి జట్టు కూడా దాదాపు 10 మ్యాచ్ లు ఆడేశాయి. మరో రెండు మూడు వారాల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) రూపంలో రెండు కొత్త జట్లు అడుగుపెట్టాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు గ్రూప్ టేబుల్ లో టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. గుజరాత్ ఒక విజయాన్ని సొంతం చేసుకుంటే.. ఎటువంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అయితే, సన్ రైజర్స్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి వల్ల సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకాస్త సంక్లిష్టం అయ్యాయి. ఇక సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరాలంటే ఏం చేయాలో ఓ లుక్కేద్దాం.

    సన్ రైజర్స్ ఇప్పటికే 10మ్యాచ్‌లు ఆడి 5మ్యాచ్‌ల్లో ఓడింది. 5మ్యాచ్‌లు గెలిచింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు సన్ రైజర్స్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచ్‌లు సన్ రైజర్స్‌కు కీలకం. ఇందులో తప్పకుండా 3 మ్యాచ్‌లు గెలిస్తేనే ప్లేఆఫ్ చేరడానికి సన్‌రైజర్స్ కు అవకాశముంటుంది. అలాగే ఒక్క మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే నెట్ రన్ రేట్ మెరుగుపడి మిగతా జట్లతో క్లాష్ కాకుండా ఉంటుంది.

    సన్ రైజర్స్ కు మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లో ముంబై తప్పా ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మూడు జట్లు ప్లేఆఫ్ రేసు కోసం పోటీలో ఉన్నవే. ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగా.. 12 పాయింట్లతో ప్రస్తుతం 4వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ జట్టు 8 పాయింట్లతో కొనసాగుతోంది.

    ఇంకా ఒక్క మ్యాచ్ ఓడినా ఆ జట్టు దాదాపు ప్లేఆఫ్ పోటీ నుంచి వైదొలుగుతుంది. అలా జరిగితే సన్ రైజర్స్ కు ప్లస్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ కు ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఉన్నా నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. అందువల్ల ఆ జట్టు ఒక్క మ్యాచ్‌లో ఓడినా దాదాపు ప్లేఆఫ్ నుంచి తప్పుకున్నట్లే. దీన్ని బట్టి కేకేఆర్, పంజాబ్ కింగ్స్ జయాపజయాలు సన్ రైజర్స్ ప్లేఆఫ్ చేరుకోవడానికి చాలా కీలకం.


    గుజరాత్ 16పాయింట్లు సాధించి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లేఆఫ్ చేరుతుంది. ఒకవేళ అన్ని మ్యాచ్‌లు ఓడిపోయినా.. గుజరాత్ రన్ రేట్ ప్రకారం.. ప్లేఆఫ్ చేరడం దాదాపు ఖరారే. ఇక లక్నో సైతం 14పాయింట్లతో కొనసాగుతుంది. ఒక్క మ్యాచ్ గెలిచిన ఆ జట్టు ప్లేఆఫ్ చేరినట్లే.

    ఇది కూడా చదవండి : కోహ్లీ, రోహిత్ లే కాదు.. మరో చాంపియన్ ప్లేయర్ కూడా అట్టర్ ఫ్లాప్.. రూ.14 కోట్లు నీళ్ల పాలు..!

    రాజస్థాన్ రాయల్స్ సైతం 12పాయింట్లతో ప్లస్ నెట్ రన్ రేట్‌తో కొనసాగుతుంది. ఇక ఆ జట్టు కూడా రెండు మ్యాచ్‌లు గెలిస్తే దాదాపు ఈ మూడు జట్లు ప్లేఆఫ్ ప్రకారం తొలి మూడు జట్లవుతాయి. అప్పుడు మిగిలిన ఒక్క స్థానం కోసం.. సన్ రైజర్స్ నాలుగు జట్లతో పోటీ పడాలి. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ ఒక్క స్థానం కోసం తీవ్ర పోటీని ఎదుర్కొక తప్పదు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Cricket, Gujarat Titans, IPL 2022, Kane Williamson, Lucknow Super Giants, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు