IPL 2022 SUNRISERS HYDERABAD BATTER RAHUL TRIPATHI WILL SELECT FOR TEAM INDIA FOR SOON FORMER HEAD COACH RAVI SHASTRI HAILS SRH BATTER SJN
IPL 2022 : ఈ రూ. 8.5 కోట్ల ఆటగాడికి టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం ఖాయం.. కావాలంటే రాసి పెట్టుకోండి!
Sunrisers Hyderabad
IPL 2022 : ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ (World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. 2020లోనే ఈ ప్రపంచకప్ జరగాల్సి ఉండగా.. కరోనావ ల్ల ఈ ఏడాదికి వాయిదా పడింది.
IPL 2022 : ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ (World Cup) జరగనున్న సంగతి తెలిసిందే. 2020లోనే ఈ ప్రపంచకప్ జరగాల్సి ఉండగా.. కరోనావ ల్ల ఈ ఏడాదికి వాయిదా పడింది. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా (Australia).. తమ సొంత దేశంలో జరిగే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టనుంది. ఇక గత ప్రపంచకప్ లో భారత జట్టు కనీసం సెమీఫైనల్ కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగే ప్రపంచక్ కోసం మంచి జట్టును పంపాలనే ఉద్దేశంతో బీసీసీఐ (BCCI) ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దాంతో ప్రపంచకప్ ముంగిట జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ కు డిమాండ్ ఏర్పడింది. ఇందులో బాగా ఆడి ప్రపంచకప్ కు ఎంపిక చేసే టీమిండియాలో చోటు దక్కించుకోవాలని చాలా మంది భారత క్రికెటర్లు పట్టుదలగా ఉన్నారు. ఇక గత కొంత కాలంగా టి20 ఫార్మాట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి అద్భుతంగా రాణిస్తున్నాడు. 2017లో రైజింగ్ సూపర్ జెయింట్స్ తరఫున ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆ తర్వార రాజస్తాన్ రాయల్స్ (2018, 2019 సీజన్లలో), కోల్ కతా నైట్ రైడర్స్ (2020, 2021 సీజన్లలో) జట్లకు ఆడాడు. ప్రతి సీజన్ లోనూ తనకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకున్నాడు. గత సీజన్ లో 17 మ్యాచ్ ల్లో 397 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్ కు ముందు జరిగిన వేలంలో త్రిపాఠిని రూ. 8.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో హైదరాబాద్ బ్యాటర్స్ రాణించకపోయినా.. త్రిపాఠి మాత్రం సూపర్ ఫామ్ తో ఆడుతున్నాడు. 13 మ్యాచ్ ల్లో 393 పరుగుల చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉండటం విశేషం.
సన్ రైజర్స్ తరఫున త్రిపాఠి మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నాడు. ఇక టీమిండియాలో అది విరాట్ కోహ్లీ స్థానం. అయితే ఈ మధ్య కాలంలో కోహ్లీ ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు. వచ్చే నెలలో సౌతాఫ్రికాతో ఆరంభమయ్యే టి20 సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతినిచ్చే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు బుమ్రా, పంత్, రోహిత్ శర్మ, షమీలకు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ కోసం రాహుల్ త్రిపాఠిని ఎంపికచేసే వీలుంది.ఇక ఆ సిరీస్ లో త్రిపాఠి రాణిస్తే.. అక్టోబర్ లో జరిగే టి20 ప్రపంచకప్ లో కూడా టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తావించడం విశేషం. త్వరలోనే త్రిపాఠి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నట్లు అతడు పేర్కొన్నాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.