IPL 2022 SUNRISERS HUDERABAD FANS TROLLS KANE WILLIAMSON FOR WORST BATTING IN IPL 2022 SEASON SJN
IPL 2022 : రేటేమో 14 కోట్లు.. స్ట్రయిక్ రేటేమో 92.. ఐపీఎల్ 2022 సీజన్ లోనే పరమ చెత్త ప్లేయర్ ఇతడే..
Sunrisers Hyderabad (IPL Twitter)
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లీగ్ దశ మరో వారం రోజుల్లో ముగియనుంది. ఎన్నడూ లేని విధంగా రెండు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం అధికారికంగా 6 జట్లు పోటీ పడుతున్నాయి.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లీగ్ దశ మరో వారం రోజుల్లో ముగియనుంది. ఎన్నడూ లేని విధంగా రెండు ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం అధికారికంగా 6 జట్లు పోటీ పడుతున్నాయి. వీటిలో నాలుగు జట్ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers HYderabad) విషయానికి వస్తే.. ఆ 6 జట్లలో ఒక జట్టుగా ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు నాకౌట్ దశకు చేరడం కష్టంగానే ఉంది. గత సీజన్ లో కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన హైదరాబాద్.. ఈ సీజన్ కోసం జట్టులో చాలా మార్పులనే చేసింది. గత కొన్నేళ్లుగా జట్టుకు వెన్నెముకగా నిలిచిన వార్నర్ (David Warner), రషీద్ ఖాన్ (Rashid Khan)లను కాదనుకొని కొత్త ప్లేయర్స్ తో ట్రై చేసింది.
కెప్టెన్సీ కేన్ విలియమ్సన్ (Kane williamson) అప్పగించి.. అదనపు బాధ్యతగా అతడిని ఓపెనర్ గా పంపింది. అయితే విలియమ్సన్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లో ధనాధన్ అంటూ ఆడింది లేదు. తాజా సీజన్ లో అతడి బ్యాటింగ్ ను చూస్తే 12 మ్యాచ్ ల్లో కేవలం 208 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒకసారి అర్ధ సెంచరీ సాధించాడు. ఇక స్ట్రయిక్ రేట్ అయితే 92.86గా ఉంది. ఇక కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అయితే 17 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. టి20 ఫార్మాట్ లో 92 స్ట్రయిక్ రేట్ అంటే ఎంత చెత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడో ఇట్టే అర్థం అవుతోంది. విలియమ్సన్ ఓపెనర్ గా విఫలం అవుతున్నా కూడా అతడి బ్యాటింగ్ ఆర్డర్ ను చేంజ్ చేయడానికి హైదరాబాద్ ఎన్నడూ ప్రయత్నించలేదు. తాము ఓడేందుకే మ్యాచ్ ఆడుతున్నట్లు సన్ రైజర్స్ వ్యవహరిస్తోంది. కోల్ కతా నైట్ రైడర్స్ () తరఫున రాహుల్ త్రిపాఠి ఓపెనర్ గా మంచి ఇన్నింగ్స్ లను ఆడాడు. అటువంటి ప్లేయర్ ను అభిషేక్ శర్మకు జోడీగా పంపకుండా.. టెస్టు బ్యాటింగ్ చేస్తోన్న విలియమ్సన్ ను పంపడం సగటు సన్ రైజర్స్ అభిమానికి మింగుడు పడని అంశం.
Is Kane Williamson the worst retention of all time? 14 crore for 200 odd runs in 12 games at a SR of 92.
What makes it worse is the fact that he was coming back from a long injury layoff, so the poor run isn't even a surprise.
చెత్తాటతో జట్టును పరాజయాల పాలు చేస్తోన్న విలియమ్సన్ పై అభిమానులు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. 2022 రీటెయిన్స్ లో విలియమ్సన్ ది వరెస్ట్ రీటెయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చెత్తాటతో విసుగు తెప్పిస్తోన్న విలియమ్సన్ ను ఓపెనింగ్ కు పదే పదే పంపడం ఏంటంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.