IPL 2022 SRH VS RCB SUNRISERS HYDERABAD CO OWNER KAVIYA MARAN TEAM WINNING CELEBRATION PICS GOES VIRAL SJN
IPL 2022 - SRH vs RCB : సన్ రైజర్స్ ను చూసి తీన్ మార్ ఆడుతోన్న కావ్య .. ఫోటోలు వైరల్..
కావ్య మారన్ (PC: TWITTER)
IPL 2022: ఇక సీజన్ ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ సన్ రైజర్స్ ఓడటంతో జట్టుపై అభిమానుల నుంచి విమర్శలు, సెటైర్లు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన కావ్య మారన్ (Kaviya Maran).. అనంతరం జరిగిన మ్యాచ్ కు హాజరు కూడా కాలేదు.
IPL 2022 - SRH vs RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు జోరు మీదుంది. గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో కేవలం మూడు మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అనంతరం డేవిడ్ వార్నర్ (David Warner)తో విభేదాలతో సన్ రైజర్స్ పరువు కూడా పోయింది. ఇక మెగా వేలానికి ముందు కేన్ విలియమ్సన్ (Kane williamson), ఉమ్రాన్ మాలిక్ (Umran Malik), అబ్దుల్ సమద్ (Abdul samad)లను రీటెయిన్ చేసుకొని విమర్శలపాలైంది. ఇక మెగా వేలంలో ఆ జట్టు కొనుగోలు చేసిన తీరుపై కూడా జట్టు ఓనర్ కావ్య మారన్ తీవ్రంగా విమర్శల పాలైంది.
ఇక సీజన్ ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ సన్ రైజర్స్ ఓడటంతో జట్టుపై అభిమానుల నుంచి విమర్శలు, సెటైర్లు వచ్చాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో జట్టు ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన కావ్య మారన్ (Kaviya Maran).. అనంతరం జరిగిన మ్యాచ్ కు హాజరు కూడా కాలేదు. కానీ, విచిత్రంగా చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super kings)తో జరిగిన మ్యాచ్ నుంచి సన్ రైజర్స్ ఆటతీరు మారిపోయింది. వరుసగా ఐదు మ్యాచ్ ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మన కావ్యమ్మ ఊరుకుంటుందా.. జట్టు వరుస విజయాలకు పొంగిపోతుంది. గ్రౌండ్ లో తీన్మార్ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి.
శనివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ జట్టు సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. జన్సెన్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీస్తే.. ఆ తర్వాత నటరాజన్ మూడు వికెట్లతో అదరగొట్టాడు. దాంతో ఆర్సీబీ జట్టు కేవలం 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్ అయింది. కనీసం 100 పరుగులు కూడా చేయలేదు. సుయాష్ ప్రభుదేశాయ్ (20 బంతుల్లో 15 పరుగులు) అత్యధిక స్కోరు. దీన్ని బట్టే అర్ధమవుతోంది వాళ్లు ఎంతగా చెత్తాట ఆడారో. మార్కొ జాన్సెన్, నట్టూ చెరో మూడు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు. భువీ, సుచిత్, ఉమ్రాన్ మాలిక్ వాళ్లకు సహకరించారు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి సన్ రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపారు. నిజం చెప్పాలంటే దడదడలాడించారు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు దెబ్బకి ఆర్‌సీబీ 8 పరుగులకే డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లి (0),అనుజ్ రావత్ (0) వికెట్లు కోల్పోయింది. జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో ఆర్‌సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. ఫాఫ్ డుప్లెసిస్ క్లీన్ బౌల్డ్ అవ్వగా.. కోహ్లీ మార్కరమ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
గ్యాలరీ నుంచి మ్యాచ్ చూస్తోన్న కావ్య మారన్ సంతోషంతో ఉబ్బితబ్బిపోయింది. జట్టు ప్రదర్శనకు మురిసిపోయింది. ఇక మ్యాచ్ లో సన్ రైజర్స్ 9 వికెట్లతో విజయం సాధించింది. ఆర్సీబీ విధించిన 69 పరుగుల లోయెస్ట్ టార్గెట్ ను సన్ రైజర్స్ ఓపెనర్లు ఆడుతూ పాడుతూ ఛేజ్ చేశారు. అభిషేక్, కేన్ విలియమ్సన్ దెబ్బకి ఆ టార్గెట్ 8 ఓవర్లలోనే ఫినిష్ చేసింది సన్ రైజర్స్. ఇంకా 12 ఓవర్లు మిగిలుండటం విశేషం. దీంతో, 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.అభిషేక్ శర్మ ( 28 బంతుల్లో 47 పరుగులు ; 8 ఫోర్లు, 1 సిక్సర్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. , కేన్ విలియమ్సన్ (17 బంతుల్లో 16 పరుగులు; 2 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (3 బంతుల్లో 7 పరుగులు, 1 సిక్సర్) అజేయంగా నిలిచారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.