హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - SRH vs RCB : హ్యాట్రిక్ ఓటములకు SRH చెక్ పెట్టేనా..? ఆర్సీబీతో కీ ఫైట్.. తుది జట్లు ఇవే..!

IPL 2022 - SRH vs RCB : హ్యాట్రిక్ ఓటములకు SRH చెక్ పెట్టేనా..? ఆర్సీబీతో కీ ఫైట్.. తుది జట్లు ఇవే..!

IPL 2022 - SRH vs RCB

IPL 2022 - SRH vs RCB

IPL 2022 - SRH vs RCB : ముఖాముఖి పోరులో సన్ రైజర్స్ దే పై చేయిగా ఉంది. జరిగిన 21 మ్యాచుల్లో 12 ఆరెంజ్ ఆర్మీ నెగ్గితే.. మరో 8 గేమ్స్ లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2022 (IPL 2022)వ సీజన్ లీగ్ స్టేజీ హోరాహోరీగా సాగుతోంది. నెలన్నర రోజులుగా అలరిస్తూ క్రికెట్ లవర్స్ ను అలరిస్తూ వస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే ప్రతి జట్టు కూడా దాదాపు 10 మ్యాచ్ లు ఆడేశాయి. మరో రెండు మూడు వారాల్లో ఐపీఎల్ లీగ్ స్టేజ్ ను కూడా పూర్తి చేసుకోనుంది. ఈ క్రమంలో మ్యాచ్ లు జరిగే కొద్ది ప్లే ఆఫ్స్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints) రూపంలో రెండు కొత్త జట్లు అడుగుపెట్టాయి. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు జట్లు గ్రూప్ టేబుల్ లో టాప్ 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే, సన్ రైజర్స్ పరిస్థితి మాత్రం కొంచెం క్లిష్టంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి వల్ల సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు ఇంకాస్త సంక్లిష్టం అయ్యాయి. ఈ నేపథ్యంలో సూపర్ సండే డబుల్ ధమాకాలో భాగంగా వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో జరిగే మ్యాచ్ ఆరెంజ్ ఆర్మీకి కీలకం కానుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం మూడున్నర గంటలకు కు ప్రారంభం కానుంది.

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)) 2022 సీజన్ లో సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) జట్టు పరిస్థితి విచిత్రంగా ఉంది. గెలుస్తే వరుస పెట్టి మ్యాచ్ లను గెలవడం లేదంటే వరుస పెట్టి ఓడటం ఇది ఈ సీజన్ లో హైదరాబాద్ పరిస్థితి. ఐపీఎల్‌ లో ఇప్పటివరకు హైదరాబాద్‌ ఆడిన పది మ్యాచుల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచింది. గత మూడు మ్యాచుల్లో హైదరాబాద్‌ జట్టు కేవలం స్వల్ప పరుగుల తేడాతోనే ఓటమిపాలైంది. అటు ఆర్సీబీ ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడితే అందులో ఆరు విజయాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో చెన్నైపై ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  బెంగళూరులో కోహ్లీ , డుప్లెసిస్‌ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం అందించాలి. కోహ్లీ ఫామ్ లో లేడు. ఫాప్ డుప్లెసిస్ టచ్ లో ఉన్నా.. భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నాడు. ఆ తర్వత బ్యాటింగ్‌ కు వచ్చే మ్యాక్స్‌ వెల్‌, దినేష్‌ కార్తీక్‌, లోమ్రార్‌ మంచి ఫామ్ లో ఉన్నారు. ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 316 పరుగులుచేశాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ బౌలింగ్‌ లో హజిల్‌వుడ్‌, సిరాజ్‌, హర్షల్‌ పటేల్‌, హసరంగా కీలకం కానున్నారు.

  ఇది కూడా చదవండి : సర్జరీ కోసం ఆస్పత్రికి వెళ్లి నర్సుతో ప్రేమాయణం.. పెళ్లికి ముందే బిడ్డ.. కేన్ మామ లవ్ స్టోరీ సూపర్..

  మరోవైపు, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ లో కెప్టెన్‌ విలియమ్సన్‌ తో పాటు అభిషేక్‌ శర్మ మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆదిలోనే వికెట్‌ కోల్పోకుండా ఆడితే హైదరాబాద్‌ జట్టు అద్భుత విజయం సాధించడం పక్కా. అభిషేక్‌ శర్మ ఇప్పటికే 331 పరుగులతో టాప్‌ స్కోరర్‌ లలో ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత మార్కర్రమ్, నికోలాస్ పూరన్‌, రాహుల్‌ త్రిపాఠి కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక హైదరాబాద్‌ పేస్‌ బౌలింగ్‌ గత మూడు మ్యాచుల నుంచి బలహీనంగా మారింది. నటరాజన్ తిరిగి జట్టులోకి చేరకపోతే కష్టమే. భువనేశ్వర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌ తో పాటు అబాట్‌, కార్తీక్‌ త్యాగిలు సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ముఖాముఖి పోరులో సన్ రైజర్స్ దే పై చేయిగా ఉంది. జరిగిన 21 మ్యాచుల్లో 12 ఆరెంజ్ ఆర్మీ నెగ్గితే.. మరో 8 గేమ్స్ లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచులో ఆర్సీబీ కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8 ఓవర్లలోనే అందుకుంది సన్ రైజర్స్. అదే, విజయాన్ని ఈ సారి కూడా రిపీట్ చేయాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

  తుది జట్లు అంచనా :

  సన్ రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, సీన్ అబాట్/ మార్కొ జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి/ నటరాజన్

  రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు : ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్‌

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Faf duplessis, Glenn Maxwell, IPL 2022, Kane Williamson, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli

  ఉత్తమ కథలు