Home /News /sports /

IPL 2022 SRH VS RCB LIVE SCORES SUNRISERS HYDERABAD VS ROYAL CHALLENGERS BANGALORE MATCH PREVIEW HEAD TO HEAD AND PREDICTED PLAYING XI SJN

IPL 2022 SRH vs RCB : కోహ్లీకిదే చివరి చాన్స్.. ఇక్కడ కూడా తేడా వస్తే ఇక అంతే సంగతులు..

 Royal Challengers Bangalore

Royal Challengers Bangalore

IPL 2022 SRH vs RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రేపు ఆసక్తికర సమరం జరగనుంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రేపు రాత్రి గం 7.30 లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడనుంది.

ఇంకా చదవండి ...
IPL 2022 SRH vs RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రేపు ఆసక్తికర సమరం జరగనుంది. బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రేపు రాత్రి గం 7.30 లకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)తో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడనుంది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడినా అనంతరం జరిగిన నాలుగు మ్యాచ్ ల్లోనూ అద్భుత విజయాలను అందుకున్న సన్ రైజర్స్ మంచి ఊపు మీద ఉంది. ఇక అదే సమయంలో ఫాఫ్ డు ప్లెసిస్ (Faf du plessis) నాయకత్వంలోని బెంగళురు కూడా 7 మ్యాచ్ ల్లో ఐదు విజయాలతో టాప్ ఫామ్ లో ఉంది. దాంతో ఈ రెండు జట్ల మధ్య బ్లాక్ బాస్టర్ మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

కలవర పెడుతోన్న విరాట్ కోహ్లీ 

రాయల్ చాలెంజర్స్ బెంగళూరును విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ కలవరపెడుతోంది. ఆరంభ మ్యాచ్ లతో పాటు.. ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఫర్వాలేదనిపించిన కోహ్లీ.. మిగిలిన మ్యాచ్ ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కోహ్లీ గత మూడు మ్యాచ్ ల ప్రదర్శనను చూస్తే 1 (చెన్నైపై), 12 (ఢిల్లీ క్యాపిటల్స్)పై, 0 (లక్నోపై) పరుగులు చేశాడు. మూడు మ్యాచ్ ల్లో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు. డు ప్లెసిస్, మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ లతో పాటు షాబాజ్ అహ్మద్ రాణిస్తుండటంతో ఆర్సీబీ గట్టెక్కుతోంది. ఇక బౌలింగ్ లో మొహమ్మద్ సిరాజ్, హేజల్ వుడ్, హర్షల్ పటేల్ లతో బలంగా ఉంది. హసరంగా అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఒక వేళ ఈ మ్యాచ్ లో కూడా అతడు రాణించకపోతే తర్వాతి మ్యాచ్ ల్లో అతడిని పక్కన పెట్టే అవకాశం కూడా లేకపోలేదు.

ఇది కూడా చదవండి : ఇందుకే కదా.. ధోనిని ’ది ఫినిషర్‘అనేది.. 20వ ఓవర్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు మహేంద్రుడి సొంతం

మరోసారి బౌలింగ్ పైనే

లీగ్ లో సన్ రైజర్స్ బౌలింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. భువనేశ్వర్, జన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లతో పాటు సుచిత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. గాయం నుంచి వాషింగ్టన్ సుందర్ కోలుకున్నట్లయితే సుచిత్ స్థానంలో తుది జట్టులోకి వస్తాడు. లేదంటే గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే విలియమ్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ లోనూ సన్ రైజర్స్ సూపర్ ఫామ్ లో ఉంది. ఓపెనర్లుగా కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మలు ఫర్వాలేదనిపిస్తున్నారు. ఇక రాహుల్ త్రిపాఠి వన్ డౌన్ లో జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. అతడితో పాటు మార్కరమ్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. నికోలస్ పూరన్ ధనాధన్ షాట్లతో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఫలితంగా సన్ రైజర్స్ బెంగళూరు జట్టు కంటే కూడా పటిష్టంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి : అమ్మో అంత డబ్బా..! ఐపీఎల్ ద్వారా అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

ముఖాముఖి

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 20 మ్యాచ్ లు జరగ్గా అందులో సన్ రైజర్స్ దే పైచేయిగా ఉంది. 11 మ్యాచ్ ల్లో హైదరాబాద్ గెలిస్తే.. 8 మ్యాచ్ ల్లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది.

తుది జట్ల అంచనా

హైదరాబాద్

విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, త్రిపాఠి, మార్కరమ్, పూరన్, శశాంక్ సింగ్/ వాషింగ్టన్ సుందర్, సుచిత్, భువనేశ్వర్, జన్సెన్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

బెంగళూరు

డు ప్లెసిస్, అనుజ్ రావత్, కోహ్లీ, మ్యాక్స్ వెల్, షాబాజ్ అహ్మద్, ప్రుభుదేశాయ్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, సిరాజ్, హేజల్ వుడ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Dinesh Karthik, Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, Kane Williamson, RCB, Royal Challengers Bangalore, SRH, Sunrisers Hyderabad, Virat kohli

తదుపరి వార్తలు