హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - SRH vs RCB : డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆఖర్లో కార్తీక్ మెరుపులు.. SRH టార్గెట్ ఇదే..

IPL 2022 - SRH vs RCB : డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆఖర్లో కార్తీక్ మెరుపులు.. SRH టార్గెట్ ఇదే..

IPL 2022 - SRH vs RCB

IPL 2022 - SRH vs RCB

IPL 2022 - SRH vs RCB : కోహ్లీ.. ఫస్ట్ బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగినా.. ఆర్సీబీ మాత్రం మంచి స్కోరు సాధించింది. ఫాఫ్ డుప్లెసిస్, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ల అద్భుత బ్యాటింగ్ తో ఫైటింగ్ టోటల్ సెచ్ చేసింది బెంగళూరు జట్టు.

ఇంకా చదవండి ...

  వాంఖడే వేదికగా సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ మంచి స్కోరు సాధించింది. కోహ్లీ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగినా.. ఆ జట్టు ఎక్కడా తడబడలేదు. ఫాఫ్ డుప్లెసిస్, పాటిదార్, మ్యాక్సీల సూపర్ బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (50 బంతుల్లో 73 పరుగులు నాటౌట్ ; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రజత్ పాటిదార్ ( 38 బంతుల్లో 48 పరుగులు ; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్ వెల్ (24 బంతుల్లో 33 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దినేష్ కార్తీక్ ( 8 బంతుల్లో 30 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్ 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ఆరెంజ్ ఆర్మీలో సుచిత్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఆర్సీబీతో మ్యాచ్‌లో తుది జట్టులోకి వచ్చిన సన్‌రైజర్స్‌ బౌలర్‌ జగదీశ సుచిత్‌ మొదటి బంతికే వికెట్‌ తీశాడు. అతడి బౌలింగ్‌లో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి డకౌట్‌ అయ్యాడు. విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. విరాట్ కోహ్లీకి ఈ సీజన్ లో ఇది మూడో గోల్డెన్ డకౌట్. అయితే.. కోహ్లీ డకౌట్ ఆర్సీబీ బ్యాటింగ్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

  ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తో కలిసిన రజత్ పాటిదార్.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరి దూకుడుగా ఆడటంతో స్కోరు వేగం పెరిగింది. ముఖ్యంగా కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్ లను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారు. స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ను డుప్లెసిస్‌ చీల్చి చెండాడాడు. ఎనిమిదో ఓవర్‌ నాలుగో బంతికి ఫోర్‌ బాదిన ఆర్సీబీ కెప్టెన్‌.. తర్వాత మరో బౌండరీతో పాటు సిక్సర్‌ కొట్టాడు. అంతుకుముందు రజత్‌ ఫోర్‌ బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తంగా 20 పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్‌ ఫాప్‌ డుప్లెసిస్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

  రైజర్స్‌ బౌలర్‌ కార్తిక్‌ త్యాగి బౌలింగ్‌లో ఫోర్‌ బాది ఈ ఫీట్‌ నమోదు చేశాడు. అంతేగాక రజత్‌తో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిన జగదీష్ సుచిత్ విడదీశాడు. అతడి బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన రజత్‌ పాటిదార్‌(48)త్రిపాఠికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. డీప్‌ మిడ్ వికెట్‌లో ఉన్న త్రిపాఠి వేగంగా స్పందించి క్యాచ్‌ పట్టడంతో ఆర్సీబీ రెండో వికెట్‌ కోల్పోయింది.

  దీంతో, 105 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. ఇక, ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్.. కెప్టెన్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో స్కోరు వేగం పెరిగింది. ఆఖర్లో భారీ షాట్లు ఆడే క్రమంలో మ్యాక్సీ కార్తీక్ త్యాగి బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇక, ఆఖర్లో దినేష్ కార్తీక్ మెరుపులతో ఆర్సీబీ మంచి స్కోరు సాధించింది.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ముఖాముఖి పోరులో సన్ రైజర్స్ దే పై చేయిగా ఉంది. జరిగిన 21 మ్యాచుల్లో 12 ఆరెంజ్ ఆర్మీ నెగ్గితే.. మరో 8 గేమ్స్ లో ఆర్సీబీ విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచులో ఆర్సీబీ కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. ఆ లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8 ఓవర్లలోనే అందుకుంది సన్ రైజర్స్. అదే, విజయాన్ని ఈ సారి కూడా రిపీట్ చేయాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

  తుది జట్లు :

  సన్‌రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, ఫరూఖీ, భువనేశ్వర్ కుమార్, జగదీశ్ సుచిత్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి

  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :- ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లొమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Faf duplessis, IPL 2022, Kane Williamson, Royal Challengers Bangalore, Sunrisers Hyderabad, Virat kohli

  ఉత్తమ కథలు