Home /News /sports /

IPL 2022 SRH VS PBKS LIVE SCORES SUNRISERS HYDERABAD VS PUNJAB KINGS MATCH PREVIEW HEAD TO HEAD PREDICTED PLAYING XI AND STATS SJN

IPL 2022: పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ పోరు నేడు.. మరోసారి కీలకం కానున్న ఆ 22 ఏళ్ల బౌలర్..

విలియమ్సన్ వర్సెస్ మయాంక్ (ఫైల్ ఫోటోస్)

విలియమ్సన్ వర్సెస్ మయాంక్ (ఫైల్ ఫోటోస్)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు మంచి జోరు మీద ఉంది. సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు మంచి జోరు మీద ఉంది. సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చింది. తొలి రెండు మ్యాచ్ లు మినహాయిస్తే సీజన్ లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తోంది. అటు బౌలింగ్ లో ఇటు బౌలింగ్ లో జట్టు నిలకడగా రాణిస్తోంది. ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం గం. 3.30 కు డీవై పాటిల్ స్టేడియంలో పవర్ హిట్టర్లతో కూడిన పంజాబ్ కింగ్స్ (Punjab kings)తో హైదరాబాద్ జట్టు ఆడనుంది. ఈ రెండు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ ల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి.

మరోసారి కీలకం కానున్న ఉమ్రాన్ మాలిక్

మ్యాచ్ మధ్యాహ్నం జరుగుతుంది కాబట్టి డ్యూ సమస్య పెద్దగా ఉండదు. దాంతో మ్యాచ్ గెలిచే విషయంలో టాస్ పాత్ర పెద్దగా ఉండబోదు. డీవై పాటిల్ అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు సమానంగా అనుకూలిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి బౌలింగ్ నే నమ్ముకుంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జన్సెన్ లతో కూడిన పేస్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో వీరు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా భారీగా పరుగులు సమర్పించుకునే ఉమ్రాన్ మాలిక్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా శ్రేయస్ అయ్యర్ లాంటి వికెట్ ను తీశాడు. నేడు జరిగే మ్యాచ్ లో కూాడా ఉమ్రాన్ మాలిక్ మరోసారి కీలకం కానున్నాడు. ఎందుకంటే భువీ, నటరాజన్, జన్సెన్ బౌలింగ్ లో పంజాబ్ బ్యాటర్లు ఆచి తూచి ఆడే అవకాశం ఉంది. ఇక ఉమ్రాన్ పేస్ ను ఉపయోగించుకుని భారీ షాట్లు కొట్టాలనే యోచనలో ఆ జట్టు ఉండొచ్చు. దాంతో పరుగులు సమర్పించుకున్నా వికెట్లు తీసే అవకాశం ఉమ్రాన్ కు ఉంటుంది. గత మ్యాచ్ లోలాగా ఈ మ్యాచ్ లోనూ ఉమ్రాన్ మాలిక్ రాణించే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ లో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, పూరన్ లు అద్భుత టచ్ లో ఉన్నారు. అయితే వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమవ్వడంతో నాణ్యమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఈ మ్యాచ్ లో శ్రేయస్ గోపాల్ ను ఆడిస్తారో లేదో చూడాలి. ఒక వేళ అదే జరిగితే సుచిత్ లేదా శశాంక్ లలో ఒకరు డగౌట్ కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక పంజాబ్ కూడా సూపర్ ఫామ్ లో ఉంది. మయాంక్, ధావన్, లివింగ్ స్టోన్, జితేశ్, స్మిత్, షారుఖ్ ఖాన్ లతో బ్యాటింగ్ భయంకరంగా ఉంది. దాంతో మరోసారి పరుగుల పండగ జరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : కొడుకు విషయంలో సచిన్ ఫ్యామిలీకి మరోసారి నిరాశ.. పాపం అంజలి టెండూల్కర్ ఏం చేసిందంటే?

ముఖాముఖి రికార్డు

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు జరగ్గా.. హైదరాబాద్ జట్టు 12 సార్లు గెలిచింది. మరో ఐదు సార్లు పంజాబ్ నెగ్గింది. అంటే లీగ్ లో హైదరాబాద్ జట్టు స్పష్టమైన అధిక్యాన్ని కలిగి ఉందన్నమాట

తుది జట్ల అంచనా

సన్ రైజర్స్ హైదరాబాద్

విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, త్రిపాఠి, మార్కరమ్, పూరన్, శశాంక్ సింగ్, సుచిత్/శ్రేయస్ గోపాల్, భువనేశ్వర్, జన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

పంజాబ్ కింగ్స్

మయాంక్ (కెప్టెన్), ధావన్, లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, జితేశ్, షారుఖ్ ఖాన్, ఒడెన్ స్మిత్, వైభవ్ అరోరా, రాహుల్ చహర్, కగిసో రబడ, అర్ష్ దీప్ సింగ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kane Williamson, Punjab kings, Shikhar Dhawan, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు