SRH vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)2022 సీజన్ లీగ్ దశకు నేటితో తెరపడనుంది. వాంఖడే వేదికగా నేటి రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), పంజాబ్ కింగ్స్ (Punjab Kings)జట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. సీజన్ లో చెత్త ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకున్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తున్నాయి. రెండు జట్లు కూడా ఆడిన 13 మ్యాచ్ ల్లో ఆరింటిలో గెలిచి మరో ఆరంటిలో ఓడి 12 పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పంజాబ్ కింగ్స్ ఏడో స్థానంలో ఉండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది.
ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు 14 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకోవడం ఖాయం. పంజాబ్ కింగ్స్ భారీ తేడాతో గెలిస్తే మాత్రం ఐదో స్థానాన్ని కూడా అందుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త సారథి కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండటంతో సీజన్ ముగియకుముందే సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ స్వదేశానికి పయనమయ్యాడు. దాంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్ గా ఎవరు బాధ్యతలు నిర్వర్తించేది ఇప్పటి వరకు సస్సెన్స్ గానే కొనసాగుతోంది. ఇప్పటికే వెస్టిండీస్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న నికోలస్ పూరన్ రూపంలో ప్రత్యామ్నాయం ఉండగా.. అతడికి సారథ్య బాధ్యతలను ఇస్తుందో లేక భువనేశ్వర్ కుమార్ వైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఇక ఇప్పటికే రెండు జట్లు కూడా నాకౌట్ నుంచి తప్పుకోవడంతో నేటి మ్యాచ్ లో రెండు టీమ్స్ కూడా ఫియర్ లెస్ క్రికెట్ ను ఆడే అవకాశం ఉంది. విలియమ్సన్ స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ లేదా రొమారియో షెపర్డ్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా
సన్ రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, మార్కరమ్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్/ రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, ఫరూఖీ, ఉమ్రాన్ మాాలిక్, నటరాజన్
పంజాబ్ కింగ్స్
జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), లివింగ్ స్టోన్, భానుక రాజపక్స, జితేశ్ శర్మ, హర్ ప్రీత్ బ్రార్, రిషి ధావన్/షారుఖ్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చహర్, కగిసో రబడ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPL, IPL 2022, Kane Williamson, Punjab kings, Shikhar Dhawan, SRH, Sunrisers Hyderabad