IPL 2022 SRH VS PBKS LIVE SCORE UPDATES SUNRISERS HYDERABAD WON THE TOSS AND OPTED TO BOWL FIRST SRD
IPL 2022 - PBKS vs SRH : టాస్ గెలిచిన SRH.. పంజాబ్ కు భారీ షాక్.. కెప్టెన్ మయాంక్ దూరం.. అతడి స్థానంలో..
IPL 2022 - PBKS vs SRH
IPL 2022 - PBKS vs SRH : ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు జరగ్గా.. హైదరాబాద్ జట్టు 12 సార్లు గెలిచింది. మరో ఐదు సార్లు పంజాబ్ నెగ్గింది. అంటే లీగ్ లో హైదరాబాద్ జట్టు స్పష్టమైన ఆధిక్యం ఉంది.
ఐపీఎల్ 2022 సీజన్ లో మరికాసేపట్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేనుంది. డీవై పాటిల్ స్టేడియంలో పవర్ హిట్టర్లతో కూడిన పంజాబ్ కింగ్స్ (Punjab kings)తో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక, జట్టులో ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది ఆరెంజ్ఆర్మీ. ఇక, పంజాబ్ కింగ్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ గాయంతో దూరమయ్యాడు. ఈ మ్యాచుకు శిఖర్ ధావన్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మయాంక్ స్థానంలో ప్రభుసిమ్రన్ సింగ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు మంచి జోరు మీద ఉంది. సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. హ్యాట్రిక్ విజయాలతో ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చింది. తొలి రెండు మ్యాచ్ లు మినహాయిస్తే సీజన్ లో హైదరాబాద్ జట్టు అన్ని విభాగాల్లోనూ సమతూకంగా కనిపిస్తోంది.
అటు బౌలింగ్ లో ఇటు బౌలింగ్ లో జట్టు నిలకడగా రాణిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి బౌలింగ్ నే నమ్ముకుంది. భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జన్సెన్ లతో కూడిన పేస్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. ఇక బ్యాటింగ్ లో కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, పూరన్ లు అద్భుత టచ్ లో ఉన్నారు. అయితే వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమవ్వడంతో నాణ్యమైన స్పిన్నర్ జట్టులో లేడు.
"Mayank injured his toe while training yesterday!" - Shikhar Dhawan, who is leading the #PBKS today.
ఇక పంజాబ్ కూడా సూపర్ ఫామ్ లో ఉంది. మయాంక్, ధావన్, లివింగ్ స్టోన్, జితేశ్ మంచి టచ్ లో ఉన్నారు. ఆఖర్లో మెరుపులు మెరిపించడానికి స్మిత్, షారుఖ్ ఖాన్ లు సై అంటునన్నారు. బౌలింగ్ లో కూడా ఆ జట్టు స్ట్రాంగ్ గానే కన్పిస్తోంది. కగిసో రబాడా, ఓడియన్ స్మిత్, అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ కీ రోల్ ప్లే చేయనున్నారు. ఇరుజట్లలో నాణ్యమైన ఆటగాళ్లు ఉండటంతో ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.
ముఖాముఖి రికార్డు
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు జరగ్గా.. హైదరాబాద్ జట్టు 12 సార్లు గెలిచింది. మరో ఐదు సార్లు పంజాబ్ నెగ్గింది. అంటే లీగ్ లో హైదరాబాద్ జట్టు స్పష్టమైన ఆధిక్యం ఉంది.
తుది జట్లు :
సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, త్రిపాఠి, మార్కరమ్, పూరన్, శశాంక్ సింగ్, సుచిత్, భువనేశ్వర్, జన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.