ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ స్టేజీ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. డెడ్ రబ్బర్ మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్ కింగ్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబై వాంఖెడె స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. ఇక, ఈ మ్యాచులో కేన్ విలియమ్సన్ బదులు భువనేశ్వర్ కుమార్ హైదరాబాద్ ను ముందుండి నడిపించనున్నాడు. రెండు మార్పులు చేసింది. రొమోరియా షెపర్డ్, సుచిత్ తిరిగి జట్టులోకి వచ్చారు. పంజాబ్ కింగ్స్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. నాథన్ ఎల్లీస్, షారుఖ్ ఖాన్, ప్రేరక్ మన్కడ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.ప్లేఆఫ్స్ రేసు నుంచి ఈ రెండు జట్లు కూడా తప్పుకొన్నాయి. గెలుపుతో ఈ సీజన్‌ను ముగించాలనే తాపత్రయం రెండు జట్లల్లో కనిపిస్తోంది. తన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడింది.
ఫస్ట్ హాఫ్‌లో వరుసగా అయిదు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకున్న తరువాత ఒక్కసారిగా కుప్పకూలింది సన్‌రైజర్స్. అయిదు మ్యాచ్‌లల్లో ఎలా విజయం సాధించిందో.. ఆ తరువాతి అయిదింట్లో అదే రేంజ్‌లో ఓడిపోయింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్నప్పటి దూకుడు కొనసాగించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌లో రెండో స్థానం వరకు ఎగబాకిన ఈ జట్టు.. ప్రస్తుతం 12 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. మొత్తంగా 13 మ్యాచ్‌లల్లో ఏడింట ఓడింది.
సన్‌రైజర్స్ కేప్టెన్ కేన్ విలియమ్సన్.. జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అతను ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తాత్కాలికంగా జట్టు కేప్టెన్సీ పగ్గాలను అందుకున్నాడు. జట్టులో రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, మార్క్రామ్, పూరన్ మంచి టచ్ లో ఉన్నారు. బౌలింగ్ లో ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్, నటరాజన్ కీలకం కానున్నారు.
మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌ది కూడా ఇదే పరిస్థితి. ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు ఆరింట్లో నెగ్గింది. 12 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. చివరి మ్యాచ్‌లో ప్రత్యర్థిని జయించడం ద్వారా పరువును నిలబెట్టుకోవడం తప్ప దాని వల్ల ఒరిగేదేమీ ఉండదు. శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లివింగ్ స్టోన్ బ్యాట్ లనుంచి మెరుపులు చూడవచ్చు. బౌలింగ్ లో కగిసో రబాడా, అర్ష్ దీప్ సింగ్, రాహుల్ చాహర్ కీలకం కానున్నారు.
తుది జట్లు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ప్రియం గర్గ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమోరియా షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీష్ సుచిత్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఫజల్ హక్ ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్,
పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టొన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లీస్, ప్రేరక్ మన్కడ్, కగిసొ రబడ, అర్ష్‌దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Kane Williamson, Punjab kings, Shikhar Dhawan, Sunrisers Hyderabad