Home /News /sports /

IPL 2022 SRH VS PBKS LIVE SCORE UPDATES SUNRISERS HYDERABAD WON BY 7 WICKETS SRD

IPL 2022 - PBKS vs SRH : తగ్గేదే లే.. తొక్కుకుంటూ పోతున్న సన్ రైజర్స్.. మార్కరమ్, పూరన్ అదుర్స్..

SRH (IPL Twitter)

SRH (IPL Twitter)

IPL 2022 - PBKS vs SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. ఫస్ట్ రెండు మ్యాచుల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ ఆ తర్వాత తగ్గేదే లే అంటోంది.

    తగ్గేదే లే.. ఇప్పుడు ఈ మాట ఆరెంజ్ ఆర్మీకి సరిగ్గా సరిపోతుంది. ఐపీఎల్ 2022 సీజన్ లో సన్ రైజర్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో పంజాబ్ తో జరిగిన మ్యాచులో హైదరాబాద్ ఏడు వికెట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ సీజన్ లో ఆరెంజ్ ఆర్మీకి ఇది వరుసగా నాలుగో విజయం. మార్కరమ్ (27 బంతుల్లో 41 పరుగులు ; 4 ఫోర్లు, 1 సిక్సర్), నికోలస్ పూరన్ ( 30 బంతుల్లో 35 పరుగులు ; 1 ఫోర్, 1 సిక్సర్), త్రిపాఠి (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్‌) సన్ రైజర్స్ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబాడా ఓ వికెట్ దక్కించుకున్నాడు.152 పరుగుల సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. రబాడా వేసిన నాలుగో ఓవర్‌ తొలి బంతికి ధవన్‌కు క్యాచ్‌ ఇచ్చి కేన్‌ మామ (9 బంతుల్లో 3) పెవిలియన్‌ బాట పట్టాడు. ఫలితంగా 14 పరుగుల వద్దే సన్‌రైజర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

    ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. చెత్త బంతుల్ని బౌండరీలు తరలించాడు ఈ యంగ్ బ్యాటర్. అయితే, మంచి జోష్ లో ఉన్న రాహుల్ త్రిపాఠిని రాహుల్ చాహర్ బోల్తా కొట్టించాడు. త్రిపాఠి (22 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్‌) చాహర్‌ బౌలింగ్‌లో షారుక్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి త్రిపాఠి పెవిలియన్‌ బాట పట్టాడు.


    ఆ కాపేపటికే త్రిపాఠిని బోల్తా కొట్టించిన చాహర్‌.. అభిషేక్‌ శర్మ (25 బంతుల్లో 31)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అభిషేక్ షారుఖ్ ఖాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 77 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆరెంజ్ ఆర్మీని మార్కరమ్, నికోలస్ పూరన్ ఆదుకున్నారు. ఏ మాత్రం హడావిడి పడకుండా జాగ్రత్తగా ఆడుతూ.. వీలు దొరికినప్పుడల్లా బౌండరీలతో రన్ రేట్ అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలో నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో మార్కరమ్ తన సూపర్ బ్యాటింగ్ తో ఆరెంజ్ ఆర్మీకి మరో అద్భుత విక్టరీ అందించాడు.

    ఇక, అంతకుముందు సన్ రైజర్స్ బౌలర్లు మరో సారి రెచ్చిపోయారు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ పేస్ ధాటికి పంజాబ్ బ్యాటర్లు అల్లాడిపోయారు. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. లివింగ్ స్టోన్ (33 బంతుల్లో 60 పరుగులు ; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నా.. మిగతా బ్యాటర్లు సహకరించలేదు. ఇక, ఉమ్రాన్ బౌలింగ్ నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. భువనేశ్వర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: IPL 2022, Kane Williamson, Punjab kings, Shikhar Dhawan, Sunrisers Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు