IPL 2022 SRH VS PBKS LIVE SCORE UPDATES SUNRISERS HYDERABAD SETS FIGHTING TOTAL ON SCORE BOARD SRD
IPL 2022 - SRH vs PBKS : హర్‌ప్రీత్, ఎల్లీస్ తీన్మార్.. ఆఖర్లో సుందర్, షెపర్డ్ మెరుపులు.. పంజాబ్ టార్గెట్ ఇదే..
Sundar (IPL Twitter)
IPL 2022 - SRH vs PBKS : డెడ్ రబ్బర్ గేమ్ లో ఆరెంజ్ ఆర్మీ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఆఖర్లో సుందర్, షెపర్డ్ సూపర్ భాగస్వామ్యంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
వాంఖడే స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచులో హైదరాబాద్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 43 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ( 19 బంతుల్లో 25 పరుగులు), రొమోరియా షెపర్డ్ (15 బంతుల్లో 26 పరుగులు నాటౌట్ ) మెరుపులు మెరిపించడంతో ఆరెంజ్ ఆర్మీ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. హర్ ప్రీత్ బ్రార్, ఎల్లీస్ చెరో మూడు వికెట్లతో హైదరాబాద్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 14 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన గార్గ్..రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మతో కలిసిన రాహుల్ త్రిపాఠి కాసేపు క్లాసీ షాట్లతో అలరించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్ కు మంచి పార్టనర్ షిప్ నెలకొల్పారు.
అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని హర్ ప్రీత్ విడదీశాడు. 61 పరుగులు వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన త్రిపాఠి.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక ఇక్కట్నుంచి వరుస విరామాల్లో ఆరెంజ్ ఆర్మీ వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 76 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
ఇక.. 87 పరుగుల వద్ద నికోలస్ పూరన్ (5) నాథన్ ఎల్లీస్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ కాసేపటికే మార్క్రామ్ (21) కూడా హర్ ప్రీత్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. దీంతో.. 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే.. కష్టాల్లో పడ్డ హైదరాబాద్ ఇన్నింగ్స్ ను ఆఖర్లో వాషింగ్టన్ సుందర్, రొమోరియా షెపర్డ్ ఆదుకున్నారు. వీరిద్దరూ చూడచక్కని షాట్లతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఆరో వికెట్ కు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరి పార్టనర్ షిప్ తో హైదరాబాద్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
తుది జట్లు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ప్రియం గర్గ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), రొమోరియా షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీష్ సుచిత్, భువనేశ్వర్ కుమార్ (కెప్టెన్), ఫజల్ హక్ ఫారూఖీ, ఉమ్రాన్ మాలిక్,
పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టొన్, షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లీస్, ప్రేరక్ మన్కడ్, కగిసొ రబడ, అర్ష్‌దీప్ సింగ్
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.