IPL 2022 SRH VS PBKS LIVE SCORE UPDATES PUNJAB KINGS SETS NORMAL TARGET ON SCORE BOARD AND UMRAN MALIK FIERY SPELL SRD
IPL 2022 - PBKS vs SRH : ఉమ్రాన్ పేస్ ధాటికి పంజాబ్ కుదేల్.. లివింగ్ స్టోన్ ఓన్లీ వారియర్.. SRH టార్గెట్ ఇదే..
Liam Livingstone (IPL Twitter)
IPL 2022 - PBKS vs SRH : మరోసారి సన్ రైజర్స్ బౌలర్లు అదుర్స్ అన్పించారు. ఉమ్రాన్, భువనేశ్వర్ పేస్ ధాటికి పంజాబ్ బ్యాటర్లు అల్లాడిపోయారు. లివింగ్ స్టోన్ ఒక్కడే తన బ్యాటింగ్ తో పంజాబ్ కు మంచి టోటల్ అందించాడు.
డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్ తో జరుగుతున్న మ్యాచులో సన్ రైజర్స్ బౌలర్లు మరో సారి రెచ్చిపోయారు. ముఖ్యంగా ఉమ్రాన్ మాలిక్ పేస్ ధాటికి పంజాబ్ బ్యాటర్లు అల్లాడిపోయారు. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది. లివింగ్ స్టోన్ (33 బంతుల్లో 60 పరుగులు ; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నా.. మిగతా బ్యాటర్లు సహకరించలేదు. ఇక, ఉమ్రాన్ బౌలింగ్ నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. భువనేశ్వర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ (8) 3వ ఓవర్లోనే పెవిలియన్‌కు చేరాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో జన్సెన్కు సునాయాసమైన క్యాచ్ ఇచ్చి గబ్బర్ వెనుదిరిగాడు. ఫలితంగా 10 పరుగుల వద్దే పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. వరుసగా రెండు బౌండరీలు బాదిన ప్రభ్‌సిమ్రన్ (14).. నటరాజన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విలియమ్సన్ చాకచక్యంగా రివ్యూ తీసుకుని మరీ ప్రభ్‌సిమ్రన్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఇక, ఈ సీజన్ లో ఫామ్ లేక నానా తంటాలు పడుతున్న బెయిర్ స్టో మరోసారి నిరాశపర్చాడు. సుచిత్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో(12) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తొలుత బౌలర్ అప్పీల్‌కు అంపైర్ ఔట్‌గా ప్రకటించగా, బెయిర్‌స్టో రివ్యూకి వెళ్లాడు. అయినా డెసిషన్ బెయిర్‌స్టోకు అనుకూలంగా రాలేదు. దీంతో, 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది పంజాబ్. ఇక, ఈ సీజన్ లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్న జితేష్ శర్మ కూడా నిరాశపర్చాడు. ఉమ్రాన్ మాలిక్ భీకరమైన పేస్‌తో సంధించిన బంతికి జితేశ్ శర్మ (11) ఔటయ్యాడు. 145కిమీ వేగంతో వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ షాట్ ఆడే క్రమంలో జితేశ్.. ఉమ్రాన్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
దీంతో 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఓ వైపు వికెట్లు పడుతున్నా లివింగ్ స్టోన్ అదిరిపోయే ఆటతో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోవడంతో నిదానంగా ఆడిన పంజాబ్ 11వ ఓవర్ తర్వాత గేర్ మార్చింది. లివింగ్ స్టోన్ కి షారుక్ ఖాన్ కూడా తోడయ్యాడు. ఈ ఇద్దరూ చెత్త బంతుల్ని బౌండరీలు దాటిస్తూ స్కోరు బోర్డులో వేగం పెంచారు. ఈ క్రమంలో లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీ సాధించాడు.
అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని.. భువనేశ్వర్ కుమార్ విడదీశాడు. భువీ బౌలింగ్ లో షారుఖ్ (26) భారీ షాట్ కు యత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ (60) కూడా భువీ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత ఓడియన్ స్మిత్ (13) ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆఖరి రెండు ఓవర్లలో పంజాబ్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. దీంతో, సాధారణ స్కోరుకే పరిమితమైంది.
ముఖాముఖి రికార్డు
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 17 మ్యాచ్ లు జరగ్గా.. హైదరాబాద్ జట్టు 12 సార్లు గెలిచింది. మరో ఐదు సార్లు పంజాబ్ నెగ్గింది. అంటే లీగ్ లో హైదరాబాద్ జట్టు స్పష్టమైన ఆధిక్యం ఉంది.
తుది జట్లు :
సన్ రైజర్స్ హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, త్రిపాఠి, మార్కరమ్, పూరన్, శశాంక్ సింగ్, సుచిత్, భువనేశ్వర్, జన్సెన్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.