IPL 2022 SRH VS MI LIVE SCORES HARDIKA PANDYA AND HIS GUJARAT TEAM MATES SINGS WHY THIS KOLAVERI DI SONG SJN
Hardik Pandya : వామ్మో హార్దిక్ నీ దగ్గర ఈ ట్యాలెంట్ కూడా ఉందా? 'వై దిస్ కొలవరి' అంటూ రెచ్చిపోయిన గుజరాత్ కెప్టెన్
Gujarat titans (PC : TWITTER)
Hardik Pandya : గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కు దూరమైన హార్దిక్ పాండ్యా (Hardik Pnadya) ఇండియన్ ప్రీమియర్ లీగ్ () 2022 సీజన్ ద్వారా మళ్లీ క్రికెట్ లో పునరాగమనం చేశాడు.
Hardik Pandya : గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కు దూరమైన హార్దిక్ పాండ్యా (Hardik Pnadya) ఇండియన్ ప్రీమియర్ లీగ్ () 2022 సీజన్ ద్వారా మళ్లీ క్రికెట్ లో పునరాగమనం చేశాడు. గత సీజన్ వరకు కూడా ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఆడిన అతడు.. తాజా సీజన్ తో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. తొలి సీజన్ అయినా కూడా అద్భుత ఆటతీరుతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు కూడా చేరుకుంది. ఈ క్రమంలో 2022 సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ పేరొందింది.
ఇక హార్దిక్ పాండ్యా కూడా కెప్టెన్సీతో అందరినీ ఇంప్రెస్ చేశాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్ కు సీనియర్లకు విశ్రాంతినిస్తే.. టీమిండియాను హార్దిక్ పాండ్యా నడిపించే అవకాశం కూడా ఉంది. ఐపీఎల్ లో అటు కెప్టెన్ గా కాకుండా బ్యాటర్ గా కూడా హార్దిక్ పాండ్యా రాణిస్తున్నాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వస్తూ ఆకట్టుకుంటున్నాడు. సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన పాండ్యా.. 351 పరుగులు చేశాడు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంతో గుజరాత్ ఆటగాళ్లు చిల్ అవుతున్నారు. ఈక్రమంలో తమిళ్ సూపర్ హిట్ సాంగ్ అయిన ’వై దిస్ కొలవరి‘ అంటూ పాట కూడా పాడారు. విజయ్ శంకర్, రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్యా, సుదర్శన్, సాయికిషోర్ లు కలిసి ఈ పాట పాడటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్ యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ శంకర్, సాయికిషోర్, సుదర్శన్ చెన్నైకి చెందిన వారు కావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్ ల్లో 10 మ్యాచ్ ల్లో గెలిచి మరో మూడింటిలో మాత్రమే ఓడిపోయింది. తద్వారా 20 పాయింట్లతో గ్రూప్ టేబుల్ లో టాప్ స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్ లో గుజరాత్ ఓడినా లీగ్ దశను గుజరాత్ టాప్ ప్లేస్ తో ముగిస్తుంది. దాంతో ఫైనల్ చేరుకోవడానికి గుజరాత్ కు రెండు అవకాశాలు ఉంటాయి. తన చివరి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గనుక గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే ఆర్సీబీ కథ కంచికి చేరినట్లే.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.