హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో.. కొడుకు మైదానంలో మ్యాచ్ విన్నింగ్ స్పెల్... అతడెవరంటే?

IPL 2022: తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో.. కొడుకు మైదానంలో మ్యాచ్ విన్నింగ్ స్పెల్... అతడెవరంటే?

అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా (PC: IPL)

అవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా (PC: IPL)

IPL 2022: అవేశ్ ఖాన్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. ఇక అదే సమయంలో అవేశ్ ఖాన్ మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతున్నాడు.

IPL 2022: తెలిసిన వారికి ఏమైనా జరిగితేనే మనం తట్టుకోలేం. ఇక మన ఇంట్లో వారిలో ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే.. మనం చేసే అన్ని పనులు మానుకుని వారి కోసం కంగారు పడుతూ ఉంటాం. ఇది చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ వర్తిస్తుంది. అదే మన అమ్మకు ఏమైనా జరిగితే తట్టుకోగలమా?  అస్సలు తట్టుకోలేము అలా అనుకుంటేనే మన ఒళ్లు జలదరిస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితినే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants) పేసర్ అవేశ్ ఖాన్ (Avesh khan ) ఎదర్కొవలసి వచ్చింది. అవేశ్ ఖాన్ తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. ఇక అదే సమయంలో అవేశ్ ఖాన్ మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతున్నాడు.

దాంతో తన తల్లి అనారోగ్యంతో హాస్టిటల్ లో చేరినా మొబైల్ ద్వారానే ఆమె క్షేమ సమాచారాన్ని అవేశ్ ఖాన్ తెలుసుకుంటున్నాడు. మనం ఎక్కడ ఉన్నా మన తల్లికి అనారోగ్యం అంటే కంగారు పడటం సహజమే. ప్రస్తుతం అవేశ్ ఖాన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఇంతటి టెన్షన్ సమయంలో కూడా అతడు అద్భుత బౌలింగ్ తో రాణించాడు. సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో జరిగిన మ్యాచ్ లో సూపర్ బౌలింగ్ తో లక్నోను గెలిపించాడు.

170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ దశలో లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్ లు క్రీజులో ఉన్నంత వరకు కూడా హైదరాబాద్ టీం గెలుస్తుందని అందరూ భావించారు. అయితే 18వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన అవేశ్ ఖాన్ మ్యాచ్ తీరునే మార్చేశాడు. వరుస బంతుల్లో ప్రమాదకర నికోలస్ పూరన్ ను, పవర్ హిట్టర్ అబ్దుల్ సమద్ లను అవుట్ చేశాడు. దాంతో మ్యాచ్ లక్నో వైపు నిలిచింది. ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన అవేశ్ ఖాన్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఐపీఎల్ కెరీర్ లో అవేశ్ ఖాన్ బెస్ట్ ఫిగర్స్ ఇవే కావడం విశేషం. ఈ మ్యాచ్ లో అవేశ్ ఖాన్ ’ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‘ అవార్డును అందుకున్నాడు.

మ్యాచ్ అనంతరం అవేశ్ ఖాన్ ను దీపక్ హుడా ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా అవేశ్ ఖాన్ తన తల్లి పరిస్థితిని వివరించాడు. ప్రస్తుతం తన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్న అతడు... దేవుడి దయ వల్ల ఆమె ఆరోగ్యం బాగుందన్నాడు. అంతేకాకుండా ఈ అవార్డును తన తల్లికి అంకితం చేస్తున్నట్లు అవేశ్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో లక్నో 12 పరుగుల తేడాతో సన్ రైజర్స్ పై గెలిచింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kane Williamson, KL Rahul, Lucknow Super Giants, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు