Home /News /sports /

IPL 2022 SRH VS LSG LIVE SCORES SUNRISERS HYDERABAD VS LUCKNOW SUPERGIANTS MATCH PREVIEW HEAD TO HEAD AND PREDICTED PLAYING XI SJN

IPL 2022: ఇదే ఆఖరి అవకాశం అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు... రేపు లక్నోతో సన్ రైజర్స్ పోరు

కేన్ విలియమ్సన్, రాహుల్ (PC: TWITTER)

కేన్ విలియమ్సన్, రాహుల్ (PC: TWITTER)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మరో మ్యాచ్ ఆడేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) సిద్ధమైంది. రేపు డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో కేన్ విలియమ్సన్ (Kane williamson) నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

ఇంకా చదవండి ...
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మరో మ్యాచ్ ఆడేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) సిద్ధమైంది. రేపు డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో కేన్ విలియమ్సన్ (Kane williamson) నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. గత మంగళవారం రాజస్తాన్ రాయల్స్ (RAjastjan Royals)తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 61 పరుగులతో ఘోర పరాభవాన్ని మూట గట్టుకున్న సంగతి తెలిసిందే. గతేడాదికి కొనసాగింపు అన్నట్లు ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటతీరు సాగింది. ఈ సీజన్ లో అన్ని జట్లు కూడా సెకండ్ బ్యాటింగ్ చేస్తూ గెలుస్తుంటే సన్ రైజర్స్ మాత్రం రెండోసారి బ్యాటింగ్ చేసి ఓడిన తొలి జట్టుగా నిలిచింది.

ఇదే ఆఖరి అవకాశం

గత మ్యాచ్ లో స్టార్ ప్లేయర్స్ తో పాటు వేలంలో కోట్లు పోసి కొన్న ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా రూ. 6.8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న అభిషేక్ శర్మ, రూ. 10.75 కోట్లు పలికిన నికోలస్ పూరన్, రీటెయిన్ ప్లేయర్ అబ్దుల్ సమద్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దగానే ఉంటుంది. కేన్ విలియమ్సన్ థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలికావల్సి వచ్చింది. ఒక దశలో సన్ రైజర్స్ 100 పరుగులు కూడా చేస్తుందా? అనే సందేహం రాగా.. వాషింగ్టన్ సుందర్, ఎయిడెన్ మార్క్ రమ్ పోరాటంతో సన్ రైజర్స్ 150 పరుగులకు చేరువగా వచ్చింది. ముఖ్యంగా సన్ రైజర్స్ కు నమ్మకమైన ప్లేయర్స్ కరువైయ్యారు. విలియమ్సన్ మినహా మిగిలిన వారు ఎప్పుడు ఆడతారో ఎప్పుడు విఫలమవుతారో చెప్పలేని పరిస్థితి. విలియ్సన్, పూరన్, మార్క్ రమ్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే కాస్తో కూస్తో ఆడే ప్లేయర్స్ గా కనిపిస్తున్నారు. ఇక అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ లను ఏం చూసి జట్టులో ఉంచుకుందో సన్ రైజర్స్ కే తెలియాలి. అభిషేక్ శర్మ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ లో కొంచె ఖర్చు చేసినా.. .తిలక్ వర్మ సన్ రైజర్స్ తరఫున ఆడేవాడు. ఈ మ్యాచ్ లో గనుక అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ లు విఫలమైతే.. ఇక వారిపై వేటు పడేలా కనిపిస్తోంది.

గాడి తప్పిన బౌలింగ్

మొన్నటి వరకు సన్ రైజర్స్ బలం బౌలింగ్. కానీ ఇప్పుడు అదే బలహీనతగా కనిపిస్తోంది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బట్లర్ వికెట్ ను భువనేశ్వర్ తొందరగానే సాధించాడు. అయితే అది కాస్తా నోబాల్ గా తేలడంతో అతడు బతికిపోయాడు. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఏకంగా నాలుగు నోబాల్స్ వేసింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో వేగం ఉన్నా... పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు. తొలి మ్యాచ్ లో కాస్తో కూస్తో రాణించింది నటరాజన్ మాత్రమే. ఇక రషీద్ ఖాన్ జట్టును వీడటంతో స్పిన్ విభాగం కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరోవైపు లక్నో మాత్రం బలంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లో సన్ రైజర్స్ కంటే మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ లో లక్నో జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

తుది జట్ల అంచనా

సన్ రైజర్స్ హైదరాబాద్

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, పూరన్, సమద్, మార్క్ రమ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

లక్నో సూపర్ జెయింట్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుశ్ బదోని, అండ్రూ టై, కృనాల్ పాండ్యా, అవేశ్ ఖాన్,  దుష్మంత చమీర, రవి బిష్ణోయ్
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kane Williamson, KL Rahul, Lucknow Super Giants, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు