హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బెంగాల్ మంత్రి బంపర్ ఆఫర్... మీ వల్ల కాదంటే చెప్పండి నేనొచ్చి ఆడతానంటూ కామెంట్

IPL 2022: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బెంగాల్ మంత్రి బంపర్ ఆఫర్... మీ వల్ల కాదంటే చెప్పండి నేనొచ్చి ఆడతానంటూ కామెంట్

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2022 Viral News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. 2021 సీజన్ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి 2022 సీజన్ లో అదరగొట్టాలని భావించిన ఆ జట్టుకు వరుస అపజయాలు పలకరించాయి.

IPL 2022 Viral News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. 2021 సీజన్ చేదు జ్ఞాపకాలను మరిచిపోయి 2022 సీజన్ లో అదరగొట్టాలని భావించిన ఆ జట్టుకు వరుస అపజయాలు పలకరించాయి. దాంతో డీలా పడ్డ ఆ జట్టు గెలుపు బాట పట్టేందుకు దారులను వెతుకుంది. తొలి మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) చేతిలో చావు దెబ్బ తిన్న హైదరాబాద్ టీం.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants) చేతిలో త్రుటిలో గెలుపును చేజార్చుకుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలిచే స్థితి నుంచి ఓడిపోవడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా కనిపిస్తుంది. తన తర్వాతి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (West bengal)తో తలపడేందుకు సన్ రైజర్స్ సిద్ధమవుతున్న వేళ... పశ్చిమ బెంగాల్ మంత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదేంటో తెలుసుకోవాలంటే చదవండి.

మరో ధోని (MS Dhoni) అంటూ 2008లో మనోజ్ తివారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఎంత వేగంగా టీమిండియాకు ఎంపికయ్యాడో... అంతే వేగంగా కనిపించకుండా కూడా పోయాడు. భుజం గాయం అతడి కెరీర్ ను నాశనం చేసింది. అయితే ఐపీఎల్ లో మాత్రం అతడు ఫర్వాలేదనిపించాడు. 2008-15 మధ్యలో టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 287 పరుగులు చేసిన ఇతడు టి20ల్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మనోజ్ తివారి ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లకు ఆడాడు. మొత్తం మీద 98 మ్యాచ్‌లు ఆడిన మనోజ్ తివారి 1,695 పరుగులు చేశాడు ఇందులో 7 అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పకుండానే మనోజ్ తివారి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. 2021లో శివ్‌పూర్‌ ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.

సోమవారం లక్నో, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా మనోజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మంత్రి హోదాలో ఉన్నా.. తాను క్రికెట్ కు ఆడేందుకు సిద్ధం అన్నట్లు ’స్టిల్ అవైలబుల్‘ అనే ట్వీట్ చేసి... సన్ రైజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లను ట్యాగ్ చేశాడు. దాంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ను చూసి మనోజ్ తివారి ఆ విధంగా ట్వీట్ చేసినట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: IPL, IPL 2022, Lucknow Super Giants, Rajasthan Royals, Sunrisers Hyderabad, West Bengal