హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరే గిఫ్ట్ ఇచ్చిన సన్ రైజర్స్.. కేన్ సాబ్ లుక్ చూస్తే మతి పోవాల్సిందే!

IPL 2022: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరే గిఫ్ట్ ఇచ్చిన సన్ రైజర్స్.. కేన్ సాబ్ లుక్ చూస్తే మతి పోవాల్సిందే!

కేన్ విలియమ్సన్ (PC: SRH)

కేన్ విలియమ్సన్ (PC: SRH)

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తలపడనుంది. రాత్రి గం. 7.30 నుంచి బ్రబోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఫోటోను ఒకటి విడుదల చేసింది.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తలపడనుంది. రాత్రి గం. 7.30 నుంచి బ్రబోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథి కేన్ విలియమ్సన్ (Kane Williamson) ఫోటోను ఒకటి విడుదల చేసింది. దాంతోొ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. పవన్ కళ్యాన్ నటించిన వకీల్ సాబ్ గెటప్ లో విలియమ్సన్ ను రెడీ చేసిన సన్ రైజర్స్ దానికి సంబంధించిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఒక చేతిలో బుక్స్ పట్టుకున్న విలియమ్సన్ మరో చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకొని.. సినిమాలో ప్రత్యర్థులపై పవన్ చెలరేగినట్లు.. నేటి మ్యాచ్ లో కేకేఆర్ బౌలర్లపై చెలరేగేందుకు కేన్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పింది. దీనికి సంబంధించిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జట్టు బాధిస్తోన్న గాయాలు

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ చేతికి గాయం కాగా.. అతడు కోలుకోవడానికి కనీసం ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉందని తేలింది .దాంతో అతడు నేటి మ్యాచ్ కు దూరం అయ్యాడు. అదే సమయంలో అతడి స్థానంలో శ్రేయస్ గోపాల్ బరిలోకి దిగనున్నాడు. ఇక గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా... రాహుల్ త్రిపాఠి తొడకండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా తప్పుకున్నాడు. అతడి గాయం తీవ్రతపై సమాచారం లేదు. కేవలం క్రాంప్స్ వల్లే అతడు తప్పుకున్నట్లయితే నేటి మ్యాచ్ లో అతడు ఆడే అవకాశం ఉంది. లేని పక్షంలో అతడు బరిలోకి దిగే అవకాశం లేకపోవచ్చు. అదే జరిగితే సన్ రైజర్స్ కు అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఎందుకంటే వన్ డౌన్ లో అతడు ఎంతో నిలకడగా ఆడుతున్నాడు. చెన్నై తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు ఢిల్లీ చేతిలో ఓడిన కేకేఆర్ ఈ మ్యాచ్ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. భారీ హిట్టర్లు ఉండటం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. దాంతో నేటి మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : ఓరి నీ ఏసాలో.. ముందు బ్యాట్ పట్టుకోవడం నేర్చుకో.. ఆ తర్వాత టీమిండియా గురించి ఆలోచిద్దువు..

హెడ్ టు హెడ్ రికార్డు

ముఖాముఖి పోరులో సన్ రైజర్స్ పై కోల్ కతా స్పష్టమైన అధిక్యాన్ని కలిగి ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 21 మ్యాచ్ లు జరగ్గా.. అందులో కేకేఆర్ 14 సార్లు విజయం సాధించింది. సన్ రైజర్స్ 7 సార్లు గెలుపొందింది. గత సీజన్ లో జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ కేకేఆర్ జట్టే గెలవడం విశేషం.

తుది జట్ల అంచనా

సన్‌రైజర్స్ హైదరాబాద్

అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి/సమర్థ్/సమద్, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్‌రమ్, శ్రేయస్ గోపాల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

కోల్ కతా నైట్ రైడర్స్

వెంకటేశ్ అయ్యర్, రహానే, శ్రేయస్ అయ్యర్, రాణా, ఆండ్రీ రస్సెల్, బిల్లింగ్స్, నరైన్, కమిన్స్, ఉమేశ్ యాదవ్, రిసిక్ దార్, వరుణ్ చక్రవర్తి


First published:

Tags: IPL, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Pawan kalyan, Shreyas Iyer, SRH, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు