SRH vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో చావోరేవో తేల్చుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) సిద్ధమైంది. ఎంసీఏ స్టేడియం వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో మ్యాచ్ కు హైదరాబాద్ జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రేయస్ అయ్యర్ రెండు మార్పులతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా మూడు మార్పులు చేసింది. ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ లో గనుక కేకేఆర్ ఓడితే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. అదే సమయంలో సన్ రైజర్స్ ఈ మ్యాచ్ ల ో ఓడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత కష్టంగా మారతాయి. అయితే అధికారికంగా మాత్రం సన్ రైజర్స్ ఇంకా ప్లే ఆఫ్స్ లో ఉంటుంది.
ఇది కూడా చదవండి : ఏందీ మైండ్ దొబ్బిందా.. సీఎస్కే సీఈవో ఏంటీ రాయుడ్ని ఇంత మాట అనేశాడు..!
ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ ఏకంగా మూడు మార్పులు చేసింది. గాయాలతో గత రెండు మ్యాచ్ లకు దూరమైన టి నటరాజన్, వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే సమయంలో మార్కో యాన్సెన్ కూడా సన్ రైజర్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక కేకేఆర్ కూడా గాయపడ్డ ప్యాట్ కమిన్స్ స్థానంలో ఉమేశ్ యాదవ్ ను.. షెల్డన్ జాక్సన్ స్థానంలో స్యామ్ బిల్లింగ్స్ ను తుది జట్టులోకి తీసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆఖరి ఘట్టంలో ఉండటంతో ప్లే ఆఫ్స్ కు ఏ జట్లు చేరుకుంటాయో అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా డూ ఆర్ డై లాంటిది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా చాలా కీలకమైనది. ఇందులో ఏ జట్టు ఓడినా ప్లే ఆఫ్స్ కు చేరుకోవడం కష్టంగా మారే అవకాశం ఉంది.
తుది జట్లు
కేకేఆర్
వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, స్యామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
సన్ రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Shreyas Iyer, SRH, Sunrisers Hyderabad