IPL 2022 SRH VS KKR LIVE SCORES HOW LED STUMPS WORK IN CRICKET LED STUMPS COST HARDIK PANDYA BREAK LED STUMP SJN
IPL 2022: ఐపీఎల్ లో ఉపయోగించే LED స్టంప్స్ ధర తెలిస్తే మీ కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. హార్దిక్ చేసిన ఆ పని వల్ల ఎంత నష్టమంటే?
LED Stumps (PC: TWITTER)
IPL 2022: క్రికెట్ లో థర్డ్ అంపైర్ తన నిర్ణయాలను మరింత సులభంగా, ఎంతో ఖచ్చితత్వంతో ఇచ్చేందుకు LED స్టంప్స్ సహాయ పడతాయి. ఇంతకుముందు ఉన్న మామూలు స్టంప్స్ వల్ల కొన్ని సందర్భాలలో థర్డ్ అంపైర్ తన నిర్ణయాలను వెల్లడించడంలో జాప్యం జరిగేది.
IPL 2022: క్రికెట్ లో థర్డ్ అంపైర్ తన నిర్ణయాలను మరింత సులభంగా, ఎంతో ఖచ్చితత్వంతో ఇచ్చేందుకు LED స్టంప్స్ సహాయ పడతాయి. ఇంతకుముందు ఉన్న మామూలు స్టంప్స్ వల్ల కొన్ని సందర్భాలలో థర్డ్ అంపైర్ తన నిర్ణయాలను వెల్లడించడంలో జాప్యం జరిగేది. అయితే టెక్నాలజీ పెరగడంతో ఐసీసీ (ICC) క్రికెట్ లో LED స్టంప్స్ ను వాడటం మొదలు పెట్టింది. అనంతరం దానిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కూడా వాడుకలోకి తెచ్చింది. దీని వల్ల ఖచ్చితమైన నిర్ణయాలు వస్తుండటంతో ధర ఎక్కువైనా వీటినే ఉపయోగించేందుకు బీసీసీఐ (BCCI) నిర్ణయం తీసుకుంది. అయితే ఐపీఎల్ లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో బీసీసీఐ జేబుకు చిల్లు పడింది.
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ (Sanju Samson)ను రనౌట్ చేసే క్రమంలో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నేరుగా వికెట్లను గిరాటేశాడు. దాంతో ఒక స్టంప్ రెండు ముక్కలైంది. ఈ విరిగిపోయిన స్టంప్ వల్ల దాదాపు బీసీసీఐకి రూ. 30 నుంచి రూ. 45 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అంటే ఒక LED స్టంప్ ఖరీదు మన కరెన్సీలో రూ. 45 లక్షల రూపాయలు అన్నమాట.
ఈ స్టంప్స్ పని తీరు అంతా కూడా బెయిల్స్ లో దాగి ఉంటుంది. వీటిలో బ్యాటరీస్ ఉంటాయి. అదే విధంగా ఒక మైక్రోప్రాసెసర్ ఉంటుంది. స్టంప్స్ తో కనెక్షన్ ఉన్నంత వరకు కూడా స్టంప్స్, బెయిల్స్ కు ఉన్న LED బల్బులు వెలగకుండా ఉంటాయి. అయితే దానికి ఏదైనా తగిలి (బాల్) సర్క్యూట్ బ్రేక్ అయితే వెంటనే బల్బ్స్ వెలుగుతాయి.
ఐసీసీ నిబంధనల ప్రకారం ఏదైనా ఆటగాడి వల్ల ఎల్‌ఈడీ స్టంప్స్‌కు నష్టం వాటిల్లితే, ఆ ఖర్చు నిర్వహకులే ఆ నష్టాన్ని భరించాలి. కాబట్టి నిన్న హార్ధిక్ పాండ్యా అనుకోకుండా చేసిన పని వల్ల ఐపీఎల్ నిర్వహకులకు రూ. 30 నుంచి రూ. 45 లక్షల వరకు నష్టం వాటిల్లింది.
ఇక రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 37 పరుగులతో విజయం సాధించింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేస్తే.. రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసి ఓడిపోయింది. ఫెర్గూసన్, యశ్ దయాల్ చెరో మూడు వికెట్ల చొప్పున సాధించారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.