SRH vs KKR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శనివారం ఎంసీఏ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers HYderabad) జట్టుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) మెరుగైన స్కోరునే సాధించింది. టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా... ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్ (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్యామ్ బిల్లింగ్స్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ఒక చెయ్యి వేయడంతో కేకేఆర్ మంచి స్కోరునే అందుకోగలిగింది. ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లుతీశాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా డూ ఆర్ డై లాంటిది. కేకేఆర్ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లే. అదే సమయంలో సన్ రైజర్స్ ఓడినట్లయితే నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నట్లు అవుతుంది.
టాస్ గెలిచి కేకేఆర్ బ్యాటింగ్ తీసుకుంది. గత మ్యాచ్ లో దంచి కొట్టిన వెంకటేశ్ అయ్యర్ (7)ను మార్కో యాన్సెన్ పెవలియన్ కు చేర్చాడు. అయితే అజింక్యా రహానే (28), నితీశ్ రాణా (26) ఆకట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ (15) పూర్ ఫామ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఉమ్రాన్ మాలిక్ ఈ మూడు వికెట్లు తీసుకోవడం విశేషం. ఒక దశలో కేకేఆర్ 94 పరుగులకే సగం వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. ఈ దశలో స్యామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్ జట్టును ఆదుకున్నారు. రస్సెల్ ధనాధన్ షాట్లతో విరుచుకుపడితే బిల్లింగ్స్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్లో రస్సెల్ మూడు భారీ సిక్సర్లతో కలిపి 20 పరుగులు సాధించాడు. దాంతో కేకేఆర్ ఫైటింగ్ టోటల్ ను హైదరాబాద్ ముందు ఉంచగలిగింది.
తుది జట్లు
కేకేఆర్
వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, స్యామ్ బిల్లింగ్స్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చక్రవర్తి
సన్ రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్కరమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో యాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, Shreyas Iyer, SRH, Sunrisers Hyderabad