Home /News /sports /

IPL 2022 SRH VS DC SRH VS DC HIGHLIGHTS SUNRISERS HYDERABAD OWNER KAVIYA MARAN AGAIN TROLLED BY FANS AFTER DAVID WARNER SUPER INNINGS SJN

Kaviya Maran : ’కావ్య పాప తిక్క కుదిరింది‘ ఈ ట్రోలింగ్ ట్వీట్స్ చూస్తే SRH ఓనర్ ఏమౌతుందో..?

కావ్య మారన్ (PC : TWITTER)

కావ్య మారన్ (PC : TWITTER)

Kaviya Maran : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Kaviya Maran : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 21 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడటంతో ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ (Kaviya Maran) మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురైంది. 2014 నుంచి 2021 వరకు డేవిడ్ వార్నర్ (David Warner) సన్ రైజర్స్ జట్టుకు వెన్నెముకగా నిలిచిన సంగతి తెలిసిందే. 2016 సీజన్ లో సన్ రైజర్స్ ను అతడు చాంపియన్ గా కూడా నిలిపాడు. అయితే 2021 సీజన్ లో సన్ రైజర్స్ ఓనర్లకు వార్నర్ కు మనస్పర్దలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతడిని హైదరాబాద్ జట్టు వదిలేసుకుంది.

ఇది కూడా చదవండి : శివ నామాలు.. మెడలో రుద్రాక్షలు.. WWEని ఏలడానికి సిద్ధమైన భారత రెజ్లర్.. ఎవరంటే?

ఇక 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున వార్నర్ ఆడుతున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై వార్నర్ ప్రతీకార ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతుల్లో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఇప్పుడు ఈ ఇన్నింగ్సే కావ్య మారన్ ను ట్రోల్ చేసేలా చేసింది. వార్నర్ తన సూపర్ ఇన్నింగ్స్ తో కావ్య మారన్ తిక్క కుదిర్చాడంటూ ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ ను మీరూ చూసేయండి మరీ..











ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. వార్నర్ తో పాటు రోవెమన్ పావెల్ ( 35 బంతుల్లో 67 పరుగులు నాటౌట్ ; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) హైదరాబాద్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.  208 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులకు పరిమితమై ఓడింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: David Warner, Delhi Capitals, Gujarat Titans, Hardik Pandya, IPL, IPL 2022, Kane Williamson, Mumbai Indians, Rishabh Pant, Rohit sharma, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు