హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022: సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఈ ఇద్దరు తిని కూర్చోడానికి తప్ప ఎందుకు పనికిరారు

IPL 2022: సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఈ ఇద్దరు తిని కూర్చోడానికి తప్ప ఎందుకు పనికిరారు

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే ఆ జట్టు ఆరంభం అలా ఉంది మరీ. 2021 దారుణ సీజన్ కు ఏ మాత్రం తగ్గకుండా 2022 సీజన్ ను సన్ రైజర్స్ జట్టు ఆరంభించింది.

ఇంకా చదవండి ...

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. ఎందుకంటే ఆ జట్టు ఆరంభం అలా ఉంది మరీ. 2021 దారుణ సీజన్ కు ఏ మాత్రం తగ్గకుండా 2022 సీజన్ ను సన్ రైజర్స్ జట్టు ఆరంభించింది. తొలుత రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్ లో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో దారుణంగా విఫలమై ఘోర పరాజయాన్ని అందుకున్న హైదరాబాద్ జట్టు... సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరిగిన మ్యాచ్ లో గెలిచే స్థితి గాడి తప్పి ఓటమి వైపు పయనించింది. అసలు జట్టులో ఎవరు ఆడతారో.. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో తెలియని స్థితిలో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఉన్నారు.

ఐపీఎల్ లో ఈ ఏడాదే అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), లక్నో జట్లు విజయాలతో దూసుకెళ్తుంటే 2016లో చాంపియన్ గా 2018లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ చెత్తాటతో అభిమానుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇక జట్టు కూర్పును పరిశీలిస్తే ఇద్దరు ఆటగాళ్ల గురించి అంతు చిక్కడం లేదు. అసలు వీరిని ఏం చూసి జట్టులోకి తీసుకున్నారో అర్థం కావడం లేదు. అందులోనూ కోట్లు పోసి మరీ. ఇందులో ఒకరినేమో రూ. 4 కోట్లకు రీటెయిన్ చేసుకుంటే... మరొకరినేమో వేలంలో పోటీ పడీ మరి రూ. 6.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఈపాటికి మీకు ఆ ఇద్దరు క్రికెటర్లు ఎవరో తెలిసే ఉంటుంది. అవును... వారిలో ఒకరు అబ్దుల్ సమద్ అయితే మరొకరు అభిషేక్ శర్మ.

అసలు వీరిని జట్టులోకి తీసుకోవడానికి గల బలమైన కారణాలు ఏంటో సగటు సన్ రైజర్స్ అభిమానికి ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. అబ్దుల్ సమద్ 2020 నుంచి జట్టుతో ఉంటున్నాడు. అతడు జమ్మూ కశ్మీర్ కు చెందిన వాడు.  సమద్ లో పవర్ హిట్టర్ ఉన్నాడని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించడంతో సమద్ ను హైదరాాబద్ జట్టు తీసుకుంది. ఇప్పటికే రెండేళ్లు గడిచిపోగా.. ఇప్పుడు మూడో ఏడాది నడుస్తోంది. ఈ సమయానికే సమద్ తనలోని హిట్టింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.  అయినా అతడు జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. ఇక మరోవైపు తిలక్ వర్మ, ఆముశ్ బదోని లాంటి వాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసినా తమను తాము నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే సమద్ మాత్రం ఇప్పటి వరకు ఆ పని చేయలేకపోయాడు.

సమద్ 2020లో 12 మ్యాచ్ లు ఆడి 111 పరుగులు చేయగా... 2021లో 11 మ్యాచ్ ల్లో మరో 111 పరుగులు చేశాడు. అయినా ఇతడిని రూ. 4 కోట్లతో 2022 సీజన్ కోసం రీటెయిన్ చేసుకుంది. ఇక ఈ సీజన్ లో ఆడిన రెండు మ్యాచ్ ల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు.  లక్నోతో జరిగిన మ్యాచ్ లో గెలిపించాల్సిన స్థితిలో క్రీజులోకి వచ్చి గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఇక రెండో ప్లేయర్ అభిషేక్ శర్మ... 2019 నుంచి ఇతడు జట్టుతో ఉన్నాడు. 2022 వేలంలో అయితే ఇతడి కోసం ఏకంగా రూ. 6.5 కోట్లను వెచ్చించి సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. ఇక ఇతడి కెరీర్ ను చూస్తే... హైదరాబాద్ తరఫున 2019లో 3 మ్యాచ్ లు ఆడి 9 పరుగులు... 2020లో 8 మ్యాచ్ లు ఆడి 71 పరుగులు, 2021లో 8 మ్యాచ్ లు ఆడి 98 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్ లో ఓపెనర్ గా ఆడిన రెండు మ్యాచ్ ల్లో 22 పరుగులు చేశాడు. వీరిద్దరూ తిని కూర్చోవడం తప్ప తమ తప్పులను తెలుసుకుని వాటిని అధిగమించి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలనే తపన ఏ కోశాన కనిపించడం లేదని తెలుస్తుంది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: IPL, IPL 2022, Kane Williamson, Lucknow Super Giants, Rajasthan Royals, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు