IPL 2022 SRH NEWS SUNRISERS HYDERABAD BATTING CONSULTANT BRIAN LARA REACTION AFTER KANE WILLIAMSON BOWLED GOES VIRAL SJN
Brian Lara : ఇదేంది రా బాబు.. వీడు మారడా.! సన్ రైజర్స్ ప్లేయర్ పై బ్రియాన్ లారా రియాక్షన్
బ్రియాన్ లారా (PC : TWITTER)
Brian Lara : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తమ చెత్త ప్రదర్శనను కనబరుస్తూనే ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే.
Brian Lara : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తమ చెత్త ప్రదర్శనను కనబరుస్తూనే ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. దాంతో ఆడిన 12 మ్యాచ్ ల్లో ఏడు పరాజయాలు ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది. ఇక జట్టును ముందుండి నడిపించాల్సిన కేన్ విలియమ్సన్ తన చెత్త ఆటతో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులతో చివాట్లు తింటున్నాడు. ఇక శనివారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్ లో 17 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేసిన అతడు.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ సీజన్ లో ఓపెనర్ గా వస్తోన్న కేన్ మామ చెత్తా ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నాడు. కేకేఆర్ తో పోరు కీలకం అని తెలిసినా.. అతడి ఆట తీరులో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఓపెనర్ గా వచ్చిన అతడు టెస్టు బ్యాటింగ్ చేశాడు. ఫైన్ లెగ్ మీదుగా భారీ షాట్ కు ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేన్ మామ అవుటైన విధానంపై జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ బ్రియాన్ లారా కూడా తన అసహనాన్ని ప్రదర్శించాడు. కేన్ విలియమ్సన్ ను ఒక్క మాట అనకపోయినా.. అతడు అవుటవ్వగానే ’వీడు మారడా‘ అన్నట్లు తల పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సీజన్ లో విలియమ్సన్ చెత్త బ్యాటింగ్ తో అందిరి చేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడి బ్యాటింగ్ ను ఒకసారి చూస్తే 12 మ్యాచ్ ల్లో కేవలం 208 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒకసారి అర్ధ సెంచరీ సాధించాడు. ఇక స్ట్రయిక్ రేట్ అయితే 92.86గా ఉంది. ఇక కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో అయితే 17 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు.టెస్టు బ్యాటింగ్ చేస్తోన్న విలియమ్సన్ ను ఓపెనర్ గా పంపిచండ ఏంటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ కు దిమాక్ ఉందా అన్నట్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.