Home /News /sports /

IPL 2022 SRH FANS TROLLED SUNRISERS HYDERABAD MANAGEMENT FOR CONDUCTING ONE WEEK CAMP AT CHENNAI SJN

IPL 2022: సన్ రైజర్స్ టీంపై అభిమానుల గుస్సా... హైదరాబాద్ జట్టేనా అంటూ ఆగ్రహం...

సన్ రైజర్స్ హైదరాబాద్

సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2022: సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు పట్ల అభిమానులు కోపంగా ఉన్నారు. ఇప్పటికే టీం ఎంపిక విషయంలో పెదవి విరిచిన వారు... తాజాగా టీం అనుసరిస్తున్న విధానాలపై గుర్రుగా ఉన్నారు.

IPL 2022: క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ నెల 26న ఘనంగా ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్ల మధ్య జరిగే పోరుతో ఐపీఎల్ 15వ సీజన్ కు తెరలేవనుంది. ఈ క్రమంలో పలు జట్లు తమ ఆటగాళ్లతో క్యాంప్ లను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సూరత్ లో మకాం పెట్టి సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తోంది. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) టీం కూడా వారం పాటు తమ జట్టుకు కూడా బెంగళూరులో క్యాంప్ ను నిర్వహించనుంది. వీరి బాటలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun risers Hyderabad) జట్టు కూడా తమ ప్లేయర్స్ కోసం వారం రోజుల పాటు క్యాంప్ ను నిర్వహించేందుకు సిద్ధమైందని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ అనలిస్ట్ వెంకటేశ్ తన ట్విట్టర్ ఖాాతా ద్వారా పేర్కొన్నారు.

ఇక్కడి వరకు అంతా బాగుంది. అయితే క్యాంప్ ను హైదరాబాద్ లో కాకుండా చెన్నైలో ఏర్పాటు చేయడంపై ఆరెంజ్ ఆర్మీ కోపంతో ఉంది. హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసేందుకు గ్రౌండ్స్ లేవా? అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. పేరుకు తెలుగు టీంగా ఉన్న జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లేయర్ ఒక్కరు కూడా లేకపోడంపై అభిమానులు కోపంతో ఉన్నారు. ఈ సమయంలో సన్ రైజర్స్ యాజమాన్యం క్యాంప్ ను చెన్నైలో పెట్టడంతో ఇది హైదరాబాద్ టీం కాదు చెన్నై రెండో టీం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.







కరోనా వల్ల ఐపీఎల్ 2022 సీజన్ మొత్తాన్ని మహారాష్ట్ర వేదికగా నాలుగు స్టేడియాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. దాంతో చెన్నై టీం తమ క్యాంపును మహారాష్ట్ర కు దగ్గరగా ఉండే సూరత్ లో పెట్టుకుంది. సూరత్ పిచ్ లు మహారాష్ట్ర పిచ్ లకు దగ్గరగా ఉంటాయి. దాంతో ఆ జట్టు తమ క్యాంపును  చెన్నైలో పెట్టుకోకుండా సూరత్ లో పెట్టుకుంది. మరి హైదరాబాదేమో వెరైటీగా ఆలోచించి చెన్నైలో పెట్టేలా ఉంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, Mumbai, Royal Challengers Bangalore, Sun risers hyderabad

తదుపరి వార్తలు