Home /News /sports /

IPL 2022 SOURAV GANULY OPENES ABOUT HIS BIOPIC IN BOLLYWOOD EXCLUSIVE INTERVIEW WITH NEWS 18 SJN

Sourav Ganguly : త్వరలోనే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ బయోపిక్.. హీరో ఎవరంటే..?

గంగూలీ (ఫైల్ ఫోటో)

గంగూలీ (ఫైల్ ఫోటో)

IPL 2022 : గురువారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తో గంగూలీ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన న్యూస్ 18 తో ముచ్చటించారు. ఈ క్రమంలో మా రిపోర్టర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

Sourav Ganguly : ఇండియన్ క్రికెట్ లో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)ది ప్రత్యేకమైన స్థానం. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) మాదిరి భారీ రికార్డులు సాధించలేకపోయినా.. తనదైన శైలిలో టీమిండియా (Team India)లో తన ముద్రను వేశాడు. ఫిక్సింగ్ వార్తలతో టీమిండియా పరువు పోయిన వేళ.. గంగూలీని 2000వ సంవత్సరంలో కెప్టెన్ గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అక్కడి నుంచి టీమిండియా క్రకెట్ ను మరో మెట్టుపైకి తీసుకెళ్లాడు గంగూలీ. ఆస్ట్రేలియా ,ఇంగ్లండ్ జట్ల ఆధిపత్యానికి గండి కొట్టేలా గంగూలీ టీమిండియాను ముందుండి నడిపించాడు. తన హయాంలోనే యువరాజ్ సింగ్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా లాంటి మ్యాచ్ విన్నర్లను టీమిండియాలోకి తీసుకొచ్చాడు. ప్రస్తుతం బీసీసీఐ బాస్ గా మారాడు. గురువారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) తో గంగూలీ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన న్యూస్ 18 తో ముచ్చటించారు. ఈ క్రమంలో మా రిపోర్టర్ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు.

రిపోర్టర్ : మీపై బాలీవుడ్ లో త్వరలోనే బయోపిక్ రాబోతుందట దాని గురించి ఏమైనా చెప్పగలరా?

గంగూలీ : ’అవును.. నాపై బయోపిక్ తీయడానికి అంగీకారం తెలిపాను. ఇప్పటికైతే ఎటువంటి వివరాలను ఇవ్వలేను. త్వరలోనే అన్ని వివరాలు ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఇంకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు. క్రికెట్ పనులతో నేను బిజీగా ఉండటం వలన స్క్రిప్ట్ కు సంబంధించి నేను ఇన్ పుట్స్ ఇవ్వలేకపోయాను. త్వరలోనే నా బయోపిక్ గురించి అప్ డేట్ ఇస్తాను‘.

గంగూలీ : బయోపిక్ పై గతేడాది సెప్టెంబర్ నుంచి వార్తలు వస్తున్నాయి. గంగూలీ బయోపిక్ ను బాలీవుడ్ లో పేరున్న నిర్మాణ సంస్థ ఒకటి నిర్మించనుందని వార్తలు కూడా వచ్చాయి. అదే విధంగా ఆ మూవీలో హీరోగా రణ్ బీర్ కపూర్ నటించే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. హీరో గురించి న్యూస్ 18 రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు గంగూలీ సమాధానం ఇవ్వలేదు.రిపోర్టర్ : ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఎలా జరుగుతుంది?

గంగూలీ : చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫేవరెట్ అంటూ ఒక జట్టును చెప్పలేని పరిస్థితి. అన్ని జట్లు కూడా చాలా బాగా ఆడుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అంచనాలకు మించి రాణిస్తున్నాయి. ఇక వ్యక్తిగత ప్రదర్శనకు వస్తే.. ఉమ్రాన్ మాలిక్ చాలా ఇంప్రెస్ చేశాడు. అలాగే ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఇప్పటికైతే టోర్నీకి ముఖ చిత్రంగా ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు.

రిపోర్టర్ : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లు పూర్ ఫామ్ తో సతమతమవుతున్నారు? వారిద్దరి ఫామ్ గురించి ఏమంటారు?

గంగూలీ : వారిద్దరు మంచి ప్లేయర్స్ . వారి స్కిల్స్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి ఆటగాడికి కూడా గడ్డు రోజులు అంటూ ఉంటాయి. కానీ నాకు నమ్మకం ఉంది. వారిద్దరు కూడా తొందర్లోనే ఫామ్ ను అందుకుంటారు. అందులో సందేహమే లేదు.

రిపోర్టర్ : ఐసీసీలో కూడా గంగూలీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దానిపై మీ కామెంట్?

గంగూలీ : ఆ వార్తల గురించి నాకు అస్సలు తెలీదు.

రిపోర్టర్ : ప్రస్తుతానికైతే దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. అయితే తొందర్లోనే దేశంలో నాలుగో వేవ్ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో జరిగే క్రికెట్ మ్యాచ్ ల విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోనున్నారు?

గంగూలీ : దేశంలో కోవిడ్ పరిస్థితులను క్షణ్ణంగా పరిశీలిస్తున్నాం. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కాకపోతే ఐపీఎల్ తర్వాత భారత్ లో జరిగే క్రికెట్ మ్యాచ్ లకు బయో బబుల్ అవసరం లేకపోవచ్చు. కరోనా ఇప్పట్లో పోయేది కాదు. మరో పదేళ్ల పాటు అది మనతోనే ఉంటుంది. దాంతో కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Bcci, Gujarat Titans, IPL, IPL 2022, Lucknow Super Giants, Rohit sharma, Sourav Ganguly, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు