హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : 6, 6, 6, W, 6, 6.. స్టొయినస్, హోల్డర్ దెబ్బకు ఆ కేకేఆర్ బౌలర్ ఖాతాలో చెత్త రికార్డు

IPL 2022 : 6, 6, 6, W, 6, 6.. స్టొయినస్, హోల్డర్ దెబ్బకు ఆ కేకేఆర్ బౌలర్ ఖాతాలో చెత్త రికార్డు

శివమ్ మావి (PC : TWITTER)

శివమ్ మావి (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శనివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata KnightRiders) జట్ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్  కేకేఆర్ బౌలర్ శివమ్ మావి (Shivam Mavi)కి పీడకల లాంటిదే.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా శనివారం రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata KnightRiders) జట్ల మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్  కేకేఆర్ బౌలర్ శివమ్ మావి (Shivam Mavi)కి పీడకల లాంటిదే. ఎందుకంటే శివమ్ మావీ బౌలింగ్ లో లక్నో బ్యాటర్స్ మార్కస్ స్టొయినస్, జేసన్ హోల్డర్  చెడుగుడు ఆడారు. లక్నో బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ విధ్వంసం జరిగింది. 19వ ఓవర్ వేయడానికి శివమ్ మావీ రాగా.. స్టొయినస్ తొలి మూడు బంతుల్లో 3 సిక్సర్లు బాదాడు. నాలుగో బంతిని కూడా సిక్సర్ కొట్టే ప్రయత్నంలో స్టొయినస్ బౌండరీ లైన్ దగ్గర శ్రయస్ అయ్యర్ () చేతికి చిక్కాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన జేసన్ హోల్డర్ ఐదు ఆరు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు.

ఇది కూడా చదవండి : కూతురి పెళ్లి అప్పు తీర్చడం కోసం ఐపీఎల్ లో బెట్టింగ్ చేసిన తల్లి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

తద్వారా 19వ ఓవర్ లో 6, 6, 6, W, 6, 6 లతో లక్నో జట్టు మొత్తం 30 పరుగులు పిండుకుంది. ఇంతవరకు ఒక కేకేఆర్‌ బౌలర్‌ మూడు సందర్భాల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నాడు. యాదృశ్చికమేంటంటే.. ఈ మూడుసార్లు శివమ్‌ మావినే ఉండడం విశేషం. శనివారం లక్నోతో మ్యాచ్‌తో పాటు.. 2018 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో.. అదే సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో మావి ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో లక్నో జట్టు 75 పరుగుల భారీ తేడాతో గెలిచి ప్లే ఆఫ్ రేసులో ముందు నిలిచింది. ఈ విజయంతో లక్నో టాప్ ప్లేసుకి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) , దీప‌క్ హుడా (27 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టొయినిస్ (14 బంతుల్లో 28 పరుగులు ; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. సౌథీ, నరైన్, శివమ్ మావీ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.

ఇది కూడా చదవండి : ’సారీ బ్రో తప్పంతా నాదే.. నన్ను క్షమించు‘.. డి కాక్ హుందాతనానికి ఫ్యాన్స్ ఫిదా!


177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోల్ కతా 14.3 ఓవర్లలో కేవలం 101 పరుగుల మాత్రమే చేసింది. దీంతో.. ఘోరపరభావాన్ని మూటగట్టుకుని.. ప్లే ఆఫ్ అవకాశాల్ని మరింత సంక్లిష్టం చేసుకుంది. కేకేఆర్ లో రస్సెల్ ( 19 బంతుల్లో 45 పరుగులు ; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) , సునీల్ నరైన్ (12 బంతుల్లో 22 పరుగులు ; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్, హోల్డర్ చెరో మూడు వికెట్లతో కోల్ కతా పతనాన్ని శాసించారు.177 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కి లక్నో బౌలర్లు చుక్కలు చూపారు. లక్నో పేసర్ బౌలర్ల ధాటికి కేకేఆర్ బ్యాటర్లు బెంబెలెత్తిపోయారు. మోహిసిన్ ఖాన్ వేసిన తొలి ఓవ‌ర్లోనే కేకేఆర్ వికెట్ కోల్పోయింది. అయుష్ బ‌దోనికి క్యాచ్ ఇచ్చి బాబా ఇంద్ర‌జిత్ (0) ఔట‌య్యాడు. తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన కేకేఆర్‌కు ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్‌లో మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Faf duplessis, Glenn Maxwell, IPL, IPL 2022, KL Rahul, Kolkata Knight Riders, Lucknow Super Giants, Royal Challengers Bangalore, SRH, Sunrisers Hyderabad, Virat kohli

ఉత్తమ కథలు