IPL 2022 schedule : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ షెడ్యూల్ ను బీసీసీఐ (BCCI) ఆదివారం విడుదల చేసింది. ధనాధన్ లీగ్ ఈ నెల 26న ఆరంభమై... మే 29న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగు పెడుతోన్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings)... ఐదో టైటిల్ పై కన్నేసింది. అంతేకాకుండా మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) కిదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. దాంతో ఈ ఐపీఎల్ సీజన్ ధోని, అతడి అభిమానులకు ప్రత్యేకంగా నిలువనుంది. మార్చి 26న జరిగే తొలి పోరులో మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ (kolkata knight riders)ను చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. దీనికి ముంబై (Mumbai)లోని విఖ్యాత వాంఖడే స్టేడియం వేదిక కానుంది. అంతేకాకుండా ధోని సారథ్యంలోని చెన్నై తన ఆఖరి నాలుగు మ్యాచ్ లను 12 రోజుల వ్యవధిలో ఆడనుంది. అప్పటికే 10 మ్యాచ్ లు ఆడి ఉంటారు కాబట్టి... ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి కూడా పడే అవకాశం ఉంది. మొత్తం 65 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు, 4 ప్లే ఆఫ్స్ పోరులతో ఐపీఎల్ క్రికెట్ అభిమానులను అలరించనుంది.
వాంఖడే, డీవై పాటిల్ స్టేడియాల్లో 20 మ్యాచ్ లు చొప్పున జరగనుండగా... పుణేలోని ఎంసీఏ స్డేడియంలో, ముంబైలోని బార్బోర్న్ స్టేడియాల్లో 15 మ్యాచ్ ల చొప్పున జరుగుతాయి. ఈసారి మొత్తం 12 డబుల్ హెడర్స్ జరగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ గం. 3.30లకు ఆరంభం కానుండగా... రాత్రి మ్యాచ్ గం. 7.30లకు స్టార్ట్ కానుంది. మే 22న హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జరిగే పోరుతో లీగ్ దశ ముగుస్తుంది. అనంతరం ప్లే ఆఫ్స్, ఫైనల్ జరగనుంది. వీటి వేదికలను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది.
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి షెడ్యూల్
తేది | ఎవరితో | సమయం | వేదిక |
మార్చి 26 | చెన్నై X కోల్ కతా | రాత్రి గం. 7.30 | వాంఖడే |
మార్చి 31 | చెన్నై X లక్నో | రాత్రి గం. 7.30 | బ్రబోర్న్ |
ఏప్రిల్ 3 | చెన్నై X పంజాబ్ | రాత్రి గం. 7.30 | బ్రబోర్న్ |
ఏప్రిల్ 9 | చెన్నై X హైదరాబాద్ | మ. గం. 3.30 | డీవై పాటిల్ |
ఏప్రిల్ 12 | చెన్నై X బెంగళూరు | రాత్రి గం. 7.30 | డీవై పాటిల్ |
ఏప్రిల్ 17 | చెన్నై X గుజరాత్ | రాత్రి గం. 7.30 | ఎంసీఏ (పుణె) |
ఏప్రిల్ 21 | చెన్నై X ముంబై | రాత్రి గం. 7.30 | డీవై పాటిల్ |
ఏప్రిల్ 25 | చెన్నై X పంజాబ్ | రాత్రి గం. 7.30 | వాంఖడే |
మే 1 | చెన్నై X హైదరాాబాద్ | రాత్రి గం. 7.30 | ఎంసీఏ (పుణె) |
మే 4 | చెన్నై X బెంగళూరు | రాత్రి గం. 7.30 | ఎంసీఏ (పుణె) |
మే 8 | చెన్నై X ఢిల్లీ | మ. గం. 3.30 | డీవై పాటిల్ |
మే 12 | చెన్నై X ముంబై | రాత్రి గం. 7.30 | వాంఖడే |
మే 15 | చెన్నై X గుజరాత్ | మ. గం. 3.30 | వాంఖడే |
మే 20 | చెన్నై X రాజస్తాన్ | రాత్రి గం. 7.30 | బ్రబోర్న్ |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Chennai Super Kings, IPL, IPL 2022, Kolkata Knight Riders, MS Dhoni, Mumbai