హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 : క్రికెట్ చరిత్రలో ఇటువంటి సంఘటన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే.. ఏకంగా వైడ్ కోసం..

IPL 2022 : క్రికెట్ చరిత్రలో ఇటువంటి సంఘటన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే.. ఏకంగా వైడ్ కోసం..

సంజూ సామ్సన్ (PC : TWITTER)

సంజూ సామ్సన్ (PC : TWITTER)

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే సీజన్ లో తరచూ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే అటు ఆన్ ఫీల్డ్, ఇటు థర్డ్ అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు కూడా.

ఇంకా చదవండి ...

IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే సీజన్ లో తరచూ అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే అటు ఆన్ ఫీల్డ్, ఇటు థర్డ్ అంపైర్లు తీసుకున్న కొన్ని నిర్ణయాలపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు కూడా. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు అయితే సీజన్ ఆరంభంలో కేన్ విలియమ్సన్ (Kane williamson) క్యాచ్ విషయంలో బీసీసీఐ (BCCI)కి ఫిర్యాదు కూడా చేసింది. అయితే దీనిపై బీసీసీఐ ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కరోనా సమయంలో లీగ్ ను ఎలాగైనా నిర్వహించాలన భీష్మించుకు కూర్చున్న బీసీసీఐ.. నాసిరకం, అనుభవం లేని అంపైర్లతో లీగ్ ను నెట్టుకొని వస్తుంది. వీళ్లేమో సీనియర్ ప్లేయర్స్ కి ఒకళా.. జూనియర్ ప్లేయర్స్ కి ఒకళా అన్నట్లు తమ నిర్ణయాలను ప్రకటిస్తూ వస్తున్నారు.

ఇది కూడా చదవండి  : శివ నామాలు.. మెడలో రుద్రాక్షలు.. WWEని ఏలడానికి సిద్ధమైన భారత రెజ్లర్.. ఎవరంటే?

ఇక సోమవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్లు తప్పుడు మీద తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. రాజస్తాన్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఒక బౌలర్ వేసిన బంతి సామ్సన్ ప్యాడ్లకు తాకింది. కేకేఆర్ బౌలర్ అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే అవుట్ గా ప్రకటించాడు. అయితే సామ్సన్ రివ్యూకి వెళ్లగా అక్కడ బంతి వికెట్లను తాకడం లేదని తేలింది. ఇక కేకేఆర్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బౌల్ట్ వేసిన బంతిని శ్రేయస్ అయ్యర్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి గ్లౌవ్ ను తాకి సామ్సన్ చేతిలో పడింది. సామ్సన్ అవుట్ అని సంబరాలు చేసుకుంటుంటే అంపైర్ మాత్రం వైడ్ అంటూ ప్రకటించాడు. ఇక్కడ రివ్యూకు వెళ్లిన సామ్సన్ సక్సెస్ అయ్యాడు.

ఇక రింకూ సింగ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో అంపైర్ ఇచ్చిన వైడ్ నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. వాస్తవానికి స్టంప్స్ కు ఇరువైపులా బ్లూ లైన్స్ ఉంటాయి. వాటికి ఆవల బౌలింగ్ చేస్తే దానిని వైడ్ గా ప్రకటిస్తారు. అయితే బ్యాటర్ షాట్ ప్రయత్నం చేస్తూ అటు ఆఫ్ సైడ్ గానీ, ఇటు లెగ్ సైడ్ గానీ జరిగితే అప్పుడు బ్లూ లైన్ ఆవల పడ్డ బంతిని వైడ్ గా ప్రకటించకూడదు అని ఇటీవలె ఐసీసీ ఒక నిబంధనను తెచ్చింది. రింకూ సింగ్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో అతడు షాట్ ఆడేందుకు ఆఫ్ సైడ్ వైపు జరిగాడు. దాంతో ప్రసిధ్ బంతిని కాస్త ఎడమగా బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ అంపైర్ వైడ్ గా ప్రకటించాడు. వాస్తవానికి అవన్నీ మంచి బంతులే. ఒక ఒక వైడ్ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైన సామ్సన్.. వైడ్ ను రివ్యూ చేయాలంటూ DRSకు కూడా వెళ్లాడు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో దీనిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Chennai Super Kings, IPL, IPL 2022, Kane Williamson, Kolkata Knight Riders, MS Dhoni, Rajasthan Royals, Sanju Samson, Shreyas Iyer, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు