IPL 2022: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఫ్యామిలీకి మరోసారి నిరాశే మిగిలింది. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం విషయంలో జాప్యం జరుగుతూనే ఉంది. వారం రోజుల ముంబై తుది జట్టులో అర్జున్ టెండూల్కర్ స్థానం ఖాయమైందనే వార్తలు రాగా.. తీరా టాస్ తర్వాత అవి ఊహాగానాలే అని తేలాయి. అయితే నిన్న లక్నో సూపర్ జెయింట్స్ (lucknow supergiants)తో జరిగిన మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) పెట్టిన ట్వీట్ మరోసారి వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ చూశాక.. లక్నోతో జరిగే మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తప్పక ఆడతాడని అతడి అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
ఇక సచిన్ ఫ్యామిలీ మొత్తం బ్రబోర్న్ స్టేడియానికి చేరుకోవడం విశేషం. పెద్దగా మ్యాచ్ లను చూడటానికి రాని సచిన్ భార్య, కూతురు అంజలీ టెండూల్కర్, సారా టెండూల్కర్ మైదానంలో తళుక్కున మెరిశారు. దాంతో అర్జున్ ఎంట్రీ ఖాయమని టాస్ కు ముందు వరకు కూడా జోరుగా ప్రచారం నడిచింది. కొడుకు అరంగేట్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకే తల్లి అంజలి, సోదరి సారా మైదానానికి వచ్చారని అంతా అనుకున్నారు. అయితే టాస్ అనంతరం అర్జున్ టెండూల్కర్ కు మరోసారి తుది జట్టులో చోటు దక్కలేదని తేలడంతో అటు సచిన్ ఫ్యామిలీ.. ఇటు సచిన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Cutiesss anjali tendulkar 😍 pic.twitter.com/UuhMA3jYY2
— Div🦁 (@div_yumm) April 16, 2022
అయితే మ్యాచ్ మధ్యలో అర్జున్ టెండూల్కర్ కు సచిన్ సలహాలిస్తూ కనిపించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ లోనూ చెత్తాటతో ఓటమిని కొని తెచ్చుకుంది. లీగ్ లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లోనూ ఓడిన ముంబై.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతుంది. దాంతో ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ఆవిరి అయినట్లే.
ఇది కూడా చదవండి: 4, 4, 4, 6, 6, 4.. దినేశ్ కార్తీక్ కొట్టుడు మామూలుగా లేదు కదా సామీ!
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 60 బంతుల్లో 103 పరుగులు నాటౌట్ ; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సూపర్ సెంచరీతో తన జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఇది కేఎల్ రాహుల్ కు ఐపీఎల్ లో వందో టీ20 మ్యాచ్. కేఎల్ రాహుల్ తో పాటు మనీశ్ పాండే (29 బంతుల్లో 38; 6 ఫోర్లు), డికాక్ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ముంబై బౌలర్లలో జై దేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లు దక్కించుకోగా.. అలెన్, మురుగన్ అశ్విన్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.
200 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (27 బంతుల్లో 37 పరుగులు ; 3 ఫోర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (13 బంతుల్లో 31 పరుగులు ; 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లతో దుమ్మురేపాడు. ఇక, లక్నోకి ఇది నాలుగో విజయం. దీంతో, 8 పాయింట్లతో టేబుల్ లో రెండో స్థానానికి ఎగబాకింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Arjun Tendulkar, Dinesh Karthik, Glenn Maxwell, IPL, IPL 2022, Mumbai Indians, Rohit sharma, Sachin Tendulkar