IPL 2022 SACHIN TENDULKAR DAUGHTER SARA TENDULKARS REACTION AFTER TIM DAVIDS RUN OUT SENDS TWITTER INTO FRENZY SJN
Sara Tendulkar : ఎంత పని జేస్తివి టిమ్ డేవిడో.! సచిన్ కూతురి వైరల్ రియాక్షన్..
సారా టెండూల్కర్ రియాక్షన్ (PC : TWITTER)
Tim David : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను కట్టిపడేసింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 పరుగలు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
Tim David : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మంగళవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ లవర్స్ ను కట్టిపడేసింది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 3 పరుగలు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. అయితే ఈ మ్యాచ్ ను సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) ప్రత్యక్షంగా వీక్షించింది. ముంబై బ్యాటర్స్ కొట్టిన ప్రతి బౌండరీకి కేరింతలు కొడుతూ సందడి చేసింది. అదే సమయంలో వికెట్ పడిన ప్రతిసారి డీలా పడ్డది. అయితే టిమ్ డేవిడ్ విషయంలో ఈమె రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం చేశారు. అయితే కమ్ బ్యాక్ చేసిన హైదరాబాద్ బౌలర్లు ఓపెనర్లతో పాటు తిలక్ వర్మ, స్యామ్స్ వికెట్లను తీసి ముంబై ని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే క్రీజులోకి వచ్చిన సింగపూర్ పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ సుడిగాలి లాంటి ఇన్నింగ్స్ తో సన్ రైజర్స్ కు విజయాన్ని దూరం చేసేలా కనిపించాడు. నటరాజన్ వేసిన 18వ ఓవర్ లో హ్యాట్రిక్ సిక్సర్లతో సహా మొత్తం 26 పరుగులు సాధించాడు. అయితే ఆరో బంతికి లేని పరుగు కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. టిమ్ డేవిడ్ రనౌట్ ను జీర్ణించుకోలేని సారా టెండూల్కర్ తెగ బాధపడిపోయింది. మొహానికి చేతులను అడ్డుపెట్టుకొని నో అన్నట్లు ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
What an incredible innings from Tim David 👏👏, Sara Tendulkar 😢😭 after tim David Got out. pic.twitter.com/CeAHlFAHda
— Cricket Apna l Indian cricket (@cricketapna1) May 17, 2022
ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. దాంతో ముంబై ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడే స్కోరును ఉంచగలిగింది. ముంబై బౌలర్లలో రమణ్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.