IPL 2022 RR VS LSG LIVE SCORES RAJASTHAN ROYALS BEAT LUCKNOW SUPERGAINTS BY 24 RUNS AND JUMPS TO 2ND PLACE IN LEAGUE TABLE SJN
RR vs LSG : రాహుల్ కు షాకిచ్చిన సంజూ సామ్సన్.. రాజస్తాన్ రాయల్స్ గెలుపుతో ఆ రెండు జట్ల ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లేనా?
రాజస్తాన్ రాయల్స్ విజయోత్సాహం (PC : IPL)
RR vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం బ్రబోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)పై రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
RR vs LSG : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) మరో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం బ్రబోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)పై రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో రాజస్తాన్ రాయల్స్ 16 పాయింట్లతో గ్రూప్ లో రెండో స్థానానికి ఎగబాకింది. వరుసగా రెండో మ్యాచ్ లో ఓడిన లక్నో జట్టు 16 పాయింట్లతో ఉన్నా ఒక స్థానం కిందికి పడి మూడో స్థానంల ోనిలిచింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో గెలవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఎందుకంటే ఆ రెండు జట్లు తమ తదుపరి అన్ని మ్యాచ్ ల్లోనూ గెలిచినా 14 పాయింట్లు మాత్రమే సాధించగలవు. కానీ, లక్నో, రాజస్తాన్ రాయల్స్ జట్లకు ఇప్పటికే 16 పాయింట్లు ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు మాత్రమే 16 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. దాంతో హైదరాబాద్, కేకేఆర్ నాకౌట్ ఆశలు ఈసారికి గల్లంతయినట్లే లెక్క.
టార్గెట్ కు దిగిన లక్నో జట్టు బౌల్ట్ దెబ్బ తీశాడు. క్వింటన్ డికాక్ (7), ఆయుశ్ బదోని (0)లను వరుస బంతుల్లో పెవిలియన్ కు చేర్చాడు. మరికాసేపటికే కేఎల్ రాహుల్ (10)ని ప్రసిధ్ అవుట్ చేశాడు. దాంతో లక్నో 29 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే దీపక్ హుడా (30 బంతుల్లో 59; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ఆదుకున్నాడు. అయితే కీలక సమయంలో భారీ షాట్ కు ప్రయత్నించి స్టంపౌట్ అయ్యాడు. ఇక చివర్లో స్టొయినస్ (17 బంతుల్లో 27) జట్టు విజయం కోసం విఫలయత్నం చేశాడు. ఆఖరి ఓవర్లో లక్నో గెలవాలంటే 34 పరుగులు కావాల్సిన తరుణంలో.. తొలి బంతిని స్టొయినస్ సిక్సర్ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే అవుటవ్వడంతో లక్నో పరాజయం ఖాయం అయ్యింది.
అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. రాజస్తాన్ రాయల్స్ తరఫున యశస్వి జైస్వాల్ (29 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (18 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ సామ్సన్ (24 బంతుల్లో 32; 6 ఫోర్లు) రాణించారు. దాంతో రాజస్తాన్ పోరాడే స్కోరును లక్నో ముందు ఉంచగలిగింది. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశాడు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.