హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - RR vs LSG : పిచ్చి ప్రయోగాలతో మ్యాచ్ చేజార్చుకున్న లక్నో.. చాహల్ మ్యాజిక్ తో రాయల్స్ సూపర్ విక్టరీ

IPL 2022 - RR vs LSG : పిచ్చి ప్రయోగాలతో మ్యాచ్ చేజార్చుకున్న లక్నో.. చాహల్ మ్యాజిక్ తో రాయల్స్ సూపర్ విక్టరీ

Yuzvendra Chahal (IPL Twitter)

Yuzvendra Chahal (IPL Twitter)

IPL 2022 - RR vs LSG : వాటే మ్యాచ్.. మరో పోరు ఆఖరి వరకు ఉత్కంఠను రేపింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరికి రాజస్థాన్ నే విజయం వరించింది. అయితే, లక్నో పిచ్చి ప్రయోగాలతో మ్యాచ్ ను చేజార్చుకుంది.

  లక్నోతో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ తన రాజసం చూపించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో చివరికి విజయాన్ని రాజస్థాన్ నే వరించింది. ఆఖరి ఓవర్ లో 15 పరుగులు అవసరమవ్వగా.. యంగ్ బౌలర్ కుల్దీప్ సేన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. మార్కస్ స్టొయినిస్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ ని పరుగులు చేయకుండా కంట్రోల్ చేశాడు. దీంతో, 3 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. 166 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. అయితే, లక్నో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి ఈ మ్యాచును చేజార్చుకుంది. మార్కస్ స్టొయినిస్ లాంటి స్టార్ బ్యాటర్ ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు పంపి ఆశ్చర్యపర్చింది. కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనిలు స్టొయినిస్ కన్నా ముందుగానే బ్యాటింగ్ కు రావడం విశేషం. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్ ( 32 బంతుల్లో 39 పరుగులు ; 2 ఫోర్లు, 1 సిక్సర్), దీపక్ హుడా (24 బంతుల్లో 25 పరుగులు ; 3 ఫోర్లు), కృనాల్ పాండ్య (15 బంతుల్లో 22 పరుగులు ; 2 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో స్టొయినిస్ ( 17 బంతుల్లో 38 పరుగులు; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. చాహల్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ట్రెండ్ బౌల్ట్ రెండు వికెట్లతో రాణించాడు.

  166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయ్. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ బౌల్ట్‌ వేసిన తొలి బంతికే గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్ రెండో బంతికి కె గౌతమ్‌ కూడా గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. దీంతో ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత 8 పరుగులు చేసిన జాసన్‌ హోల్డర్‌ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

  దీంతో, 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది లక్నో. అయితే.. మార్కస్ స్టొయినిస్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ ను ముందు బ్యాటింగ్ కు దింపకుంటా రకరకాల ప్రయోగాలు చేసింది లక్నో. ఇక, ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా.. మరో ఓపెనర్ డికాక్ తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడాడు. అయితే, దీపక్‌ హుడా(25) రూపంలో లక్నో సూపర్‌జెయింట్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. కుల్దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో దీపక్‌ హుడా క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.

  దీంతో, 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక, ఈ సీజన్ లో లక్నో ఫినిషర్ గా పేరు సంపాదించిన ఆయుష్ బదోని ఈ సారి మాత్రం నిరాశపర్చాడు. కేవలం ఐదు పరుగులు చేసిన బదోని.. చాహల్ బౌలింగ్ లో రియాన్ పరాగ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 74 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కూడా మార్కస్ స్టొయినిస్ ను బ్యాటింగ్ కు పంపలేదు లక్నో.

  కృనాల్ పాండ్యాను బరిలోకి దింపింది. డికాక్ తో కలసి.. కృనాల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. అయితే.. 32 బంతుల్లో 39 పరుగులు చేసిన డికాక్ చాహల్ బౌలింగ్ లో రియాన్ పరాగ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో, 101 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే కృనాల్ పాండ్యను కూడా పెవిలియన్ బాట పట్టించాడు చాహల్. 15 బంతుల్లో 22 పరుగులు చేసిన కృనాల్ చాహల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో చమీరా, స్టొయినిస్ మెరుపులు మెరిపించారు. కానీ, అప్పటికే ఆలస్యమైంది.

  ఇక, అంతకుముందు.. రాజస్థాన్ రాయల్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఓ దశలో కష్టాల్లో ఉన్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు ఆఖర్లో మంచి మైలేజ్ ఇచ్చాడు హెట్ మేయర్. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. హెట్ మేయర్ (36 బంతుల్లో 59 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్, 6 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 28 పరుగులు ; 2 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 29 పరుగులు ; 4 ఫోర్లు) రాణించారు. క్రిష్ణప్ప గౌతమ్, హోల్డర్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటాడు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rajasthan Royals, Sanju Samson

  ఉత్తమ కథలు