హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - RR vs LSG : హెట్మెయర్ ధమాకా బ్యాటింగ్.. లక్నో ముందు ఫైటింగ్ టోటల్..

IPL 2022 - RR vs LSG : హెట్మెయర్ ధమాకా బ్యాటింగ్.. లక్నో ముందు ఫైటింగ్ టోటల్..

IPL 2022 - RR vs LSG : ఒకదశలో రాజస్థాన్ స్కోరు 120 పరుగులు అయినా దాటుతుందో లేదో అనుకున్నారంతా. కానీ, హెట్మెయర్ మాత్రం అంచనాల్ని తలకిందులు చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో లక్నో ముందు ఫైటింగ్ టోటల్ ఉంచాడు.

IPL 2022 - RR vs LSG : ఒకదశలో రాజస్థాన్ స్కోరు 120 పరుగులు అయినా దాటుతుందో లేదో అనుకున్నారంతా. కానీ, హెట్మెయర్ మాత్రం అంచనాల్ని తలకిందులు చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో లక్నో ముందు ఫైటింగ్ టోటల్ ఉంచాడు.

IPL 2022 - RR vs LSG : ఒకదశలో రాజస్థాన్ స్కోరు 120 పరుగులు అయినా దాటుతుందో లేదో అనుకున్నారంతా. కానీ, హెట్మెయర్ మాత్రం అంచనాల్ని తలకిందులు చేశాడు. సూపర్ బ్యాటింగ్ తో లక్నో ముందు ఫైటింగ్ టోటల్ ఉంచాడు.

  ముంబై వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. ఓ దశలో కష్టాల్లో ఉన్న రాజస్థాన్ ఇన్నింగ్స్ కు ఆఖర్లో మంచి మైలేజ్ ఇచ్చాడు హెట్ మేయర్. దీంతో, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. హెట్ మేయర్ (36 బంతుల్లో 59 పరుగులు నాటౌట్ ; 1 ఫోర్, 6 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 28 పరుగులు ; 2 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్ (29 బంతుల్లో 29 పరుగులు ; 4 ఫోర్లు) రాణించారు. క్రిష్ణప్ప గౌతమ్, హోల్డర్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ కు మంచి ఆరంభం అందించారు ఓపెనర్లు బట్లర్, పడిక్కల్. 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అయితే, సూపర్‌ ఫామ్‌లో ఉన్న జాస్‌ బట్లర్‌ ను బోల్తా కొట్టించాడు ఆవేశ్ ఖాన్. 13 పరుగులు చేసిన బట్లర్ ఓ సూపర్ బంతికి ఆవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో, 42 పరుగులకు ఫస్ట్ వికెట్ కోల్పోయింది రాజస్థాన్. ఆ తర్వాత రాజస్థాన్ స్కోరు వేగానికి బ్రేకులు పడింది.

  రాజస్థాన్ బ్యాటర్లు నిదానంగా ఆడటంతో ఒక్కసారిగా ఒత్తిడిలోకి వెళ్లారు. దీంతో, రాజస్తాన్‌ రాయల్స్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. కె గౌతమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ తొలి బంతికి పడిక్కల్‌(29)‌ఔట్‌ కాగా.. ఐదో బంతికి వాండర్‌ డుసెన్‌ (4) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో.. 64 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ కాసేపటికే రాజస్థాన్ కెప్టెన్ సంజూ శామ్సన్ (13) కూడా ఔటవ్వడంతో రాజస్థాన్ కష్టాలు మరింత పెరిగాయ్. సంజూ శామ్సన్ హోల్డర్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

  ఆ తర్వాత.. హెట్మేయర్, రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్ ఇన్నింగ్స్ ను సరిదిద్దే బాధ్యతను తమపై వేసుకున్నారు. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక, 17 వ ఓవర్ నుంచి హెట్ మేయర్ తన విశ్వరూపం చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిన కరేబియన్ వీరుడు రాజస్థాన్ రాయల్స్ కు మంచి స్కోరు అందించాడు. ఈ క్రమంలో హెట్మేయర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, హెట్ మేయర్ ఇచ్చిన క్యాచ్ ని కృనాల్ పాండ్యా మిస్ చేసి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

  తుది జట్లు :

  రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌: జోస్ బట్లర్, రస్సీ వాండర్ డస్సెన్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, కుల్దీప్ సేన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

  ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

  First published:

  Tags: IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson

  ఉత్తమ కథలు