హోమ్ /వార్తలు /క్రీడలు /

IPL 2022 - RR vs LSG : టాస్ గెలిచిన లక్నో.. జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్.. రెండు మార్పులతో బరిలోకి RR..

IPL 2022 - RR vs LSG : టాస్ గెలిచిన లక్నో.. జట్టులోకి స్టార్ ఆల్ రౌండర్.. రెండు మార్పులతో బరిలోకి RR..

IPL 2022 - RR vs LSG

IPL 2022 - RR vs LSG

IPL 2022 - RR vs LSG : ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాలు సాధించిన ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో నాల్గో స్థానంలో ఉంది. ఇక 3 మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాలు సాధించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది.

ఇంకా చదవండి ...

  ఐపీఎల్ 2022లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్ కు కాసేపట్లో తెరలేవనుంది. సండే డబుల్ ధమాకాలో భాగంగా రెండో ఫైట్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజ‌యాలు సాధించిన ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో నాల్గో స్థానంలో ఉంది. ఇక 3 మ్యాచ్‌ల్లో రెండు విజ‌యాలు సాధించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌ పాయింట్ల ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో ఉంది. ఇక, ఈ మ్యాచులో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది లక్నో. ఎవిన్ లూయిస్ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ మార్కస్ స్టొయినిస్ ను జట్టులోకి తీసుకుంది లక్నో. ఇక, ఆండ్రూ టై స్థానంలో దుష్మంత చమీరాను తిరిగి జట్టులోకి తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా రెండు మార్పులు చేసింది. రస్సీ వాండర్ డస్సెన్, కుల్దీప్ సేన్ ల్ని జట్టులోకి తీసుకుంది.

  రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తోంది. జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, షిమ్రాన్ హెట్‌మేయ‌ర్ లతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక, వారి బౌలింగ్ లైనప్ కూడా భీకరంగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ వంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు రాజస్థాన్ సొంతం. చాహల్ అద్భుతంగా బౌలింగ్ వేస్తూ.. రాయల్స్ విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. అశ్విన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇక పేస్ కోటాలో ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, ట్రెంట్ బౌల్ట్ బ‌రిలోకి దిగ‌నున్నారు.

  ఇక, ఈ సీజన్ కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఇక ల‌క్నో ఇన్నింగ్స్‌ను క్వింట‌న్ డికాక్, కేఎల్ రాహుల్ ప్రారంభించ‌నున్నారు. వీరిద్దరూ మంచి టచ్ లో ఉన్నారు. మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోనిలతో ఆ తర్వాత బ్యాటింగ్ లైనప్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంది. ఈ ముగ్గురు కూడా మంచి టచ్ లో ఉన్నారు. బదోని ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక ఏడో స్థానంలో ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా, ఎనిమిదో స్థానంలో మ‌రో ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ బ్యాటింగ్ చేయ‌నున్నారు. ఇక బౌల‌ర్లుగా ర‌వి బిష్ణోయ్, ఆవేష్ ఖాన్, దుష్మంత చమీర ఆడ‌నున్నారు.

  తుది జట్లు :

  రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌: జోస్ బట్లర్, రస్సీ వాండర్ డస్సెన్, దేవ్‌దత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ & వికెట్ కీప‌ర్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, జిమ్మీ నీషమ్, కుల్దీప్ సేన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

  ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్), మార్కస్ స్టొయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, IPL 2022, KL Rahul, Lucknow Super Giants, Rajasthan Royals, Sanju Samson

  ఉత్తమ కథలు