IPL 2022 RR VS LSG FANS SLAMS ON RAJASTHAN ROYALS YOUNG CRICKETER RIYAN PARAG FOR HIS WORST ON FIELD BEHAVIOR SJN
Riyan Parag : నువ్వు నీ వెకిలి చేష్టలు..చూస్తుంటే అతికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడే.. రాజస్తాన్ ప్లేయర్ పై ఫ్యాన్స్ ఫైర్
రియాన్ పరాగ్ (PC : TWITTER)
Riyan Parag : రియాన్ పరాగ్ (Riyan Parag).. ఈ సీజన్ లో ఒకే ఒక అర్ధ సెంచరీతో మెరిసిన 21 ఏళ్ల రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఆటగాడు. బంతిని చక్కగా టైమింగ్ చేయగలడు. కష్టపడితే ఏదో ఒక రోజు టీమిండియా (Team India)లో కూడా చోటు దక్కడం ఖాయం అంటూ చాలా మంది క్రికెట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Riyan Parag : రియాన్ పరాగ్ (Riyan Parag).. ఈ సీజన్ లో ఒకే ఒక అర్ధ సెంచరీతో మెరిసిన 21 ఏళ్ల రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) ఆటగాడు. బంతిని చక్కగా టైమింగ్ చేయగలడు. కష్టపడితే ఏదో ఒక రోజు టీమిండియా (Team India)లో కూడా చోటు దక్కడం ఖాయం అంటూ చాలా మంది క్రికెట్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ, మనోడు మైదనాలంలో వ్యవహరించే తీరుపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాచ్ పట్టినా.. డైవ్ చేసి ఫీల్డింగ్ ఆపినా తాను మాత్రమే అలాంటివి చేయగలననే అతివిశ్వాసంతో చేేసే వింత చేష్టలు అందరిలోనూ విసుగును తెప్పిస్తున్నాయి. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergaints)తో జరిగిన మ్యాచ్ లోనూ పరాగ్ వింత ప్రవర్తనతో మరోసారి వార్తల్లోకెక్కాడు.
19వ ఓవర్ లో లక్నో ఆల్ రౌండర్ స్టొయినస్ లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి సరిగ్గా టైమ్ కాకపోవడంతో పరాగ్ ఫీల్డింగ్ చేస్తోన్న చోటుకు సమీపంగా వెళ్లింది. పరాగ్ ముందుకు డైవ్ చేస్తూ క్యాచ్ ను అందుకున్నాడు. రియల్ టైమ్ లో పరాగ్ అద్భుత క్యాచ్ ను అందుకున్నట్లు కనిపించింది. ఇక క్యాచ్ తర్వాత పరాగ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే అంపైర్లకు క్యాచ్ పై డౌట్ ఉండటంతో థర్డ్ అంపైర్ కు నివేదించారు. రీప్లేలో బంతి పరాగ్ చేతుల్లోకి వెళ్లాడానికంటే ముందు నేలపై బౌన్స్ అయినట్లు తేలింది. దాంతో పరాగ్ ఆనందం నీరుగారిపోయింది. ఒక 20 ఓవర్లలో లక్నో గెలవాలంటే 34 పరుగులు చేయాల్సిన తరుణంలో తొలి బంతిని స్టొయినస్ భారీ సిక్సర్ బాదాడు. రెండో బంతికి మరో సిక్సర్ కొట్టే ప్రయత్నంలో పరాగ్ చేతికే చిక్కి పెవిలియన్ కు చేరాడు. అయితే ఇక్కడ పరాగ్ క్యాచ్ పట్టిన అనంతరం చేసిన సెలబ్రేషన్ అందరి చేత చివాట్లు తినేలా చేస్తోంది. క్యాచ్ అనంతరం బంతిని నేలకు దగ్గరగా తీసుకెళ్లిన పరాగ్.. బంతి నేలకు తగల్లేదు అని అంపైర్లు తెలియజేసే పని చేశాడు. ఎందుకంటే అంతకంటే ముందు పట్టిన క్యాచ్ నేలకు తాకడంతో.. ఇది కూడా నేలకు తాకిందని నాటౌట్ ఇచ్చేరంటూ అంపైర్స్ కే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ రకంగా పరాగ్ తన అపరిపక్వతను చాపను పరిచినట్లు పరిచేశాడు.
"I got an advice for you young man, Cricket is very very long game we all have very long memories, never ever tame fate because it comes around quickly" - Hayden on air
ఇక ఈ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు మరింతగా చేరువైంది. అధికారికంగా కాకపోయినా లక్నో, రాజస్తాన్ జట్లు దాదాపుగా నాకౌట్ దశకు చేరుకున్నట్లే. ఇక ప్లే ఆఫ్స్ ఆఖరి స్థానం కోసం మధ్య ఐదు జట్లు పోటీ పడుతున్నాయి.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.