KKR vs RR : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో భాగంగా మరికాసేపట్లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఫీల్డింగ్ ఎంచుకుంది. గత ఐదు మ్యాచ్ ల్లోనూ ఓడిపోయి ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టం చేసుకున్న కేకేఆర్ కు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్ లో గనుక కేకేఆర్ ఓడిపోతే అది ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) చేతిలో ఓడిన రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ కావాలని చూస్తోంది.
ఈ సీజన్ లో కేకేఆర్ పై రాయల్ దే పైచేయి
ఈ సీజన్ లో ఇప్పటికే ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. అందులో రాజస్తాన్ రాయల్స్ విక్టరీని సాధించింది. రాజస్తాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో ఆరింటిలో గెలిచి మరో మూడింటిలో ఓడి 12 పాయింట్లతో గ్రూప్ లో మూడో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ పరిస్థితి రాజస్తాన్ రాయల్స్ కు వ్యతిరేఖంగా ఉంది. ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్ ల్లో మూడింటిలో గెలిచి ఆరింటిలో ఓడి 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్ లో జాస్ బట్లర్ మరోసారి రాణించడానికి రెడీ గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ బలంగా ఉండగా.. దానికి విరుద్ధంగా కేకేఆర్ బ్యాటింగ్ పేలవంగా ఉంది. ఇక బౌలింగ్ లో కూడా కేకేఆర్ కంటే కూడా రాజస్తాన్ రాయల్స్ జట్టే బలంగా ఉంది. అయితే శ్రేయస్ అయ్యర్ టీంకు ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో గనుక కేకేఆర్ ఓడితే ఆ జట్టు కథ కంచికి చేరడం ఖాయం.
ఇది కూడా చదవండి : రెండు స్థానాలు.. రేసులో ఏడు జట్లు.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరే జట్లు ఏవంటే?
తుది జట్లు
కోల్ కతా నైట్ రైడర్స్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఆరోన్ ఫించ్, అంకుల్ రాయ్, బాబా ఇంద్రజిత్, నితీశ్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌతీ, శివమ్ మావీ.
రాజస్తాన్ రాయల్స్
సంజూ సామ్సన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, జాస్ బట్లర్, కరుణ్ నాయర్, హెట్ మైర్, పరాగ్, అశ్విన్, ప్రసిధ్, బౌల్ట్, కుల్దీప్ సేన్, చహల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andre Russell, IPL, IPL 2022, Kolkata Knight Riders, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson, Shreyas Iyer