Home /News /sports /

IPL 2022 RR VS CSK LIVE SCORE UPDATES RAJASTHAN ROYALS WON BY 5 WICKETS AND RAVICHANDRAN ASHWIN BRILLIANT KNOCK SRD

IPL 2022 - RR vs CSK : అశ్విన్ సూపర్ ఇన్నింగ్స్.. రెండో స్థానం RRదే.. ఓటమితో చెన్నై ఇంటికి..

Ravichandran Ashwin ( IPL Twitter)

Ravichandran Ashwin ( IPL Twitter)

IPL 2022 - RR vs CSK : ఐపీఎల్ 2022 సీజన్ ను ఓటమితో ముగించింది చెన్నై సూపర్ కింగ్స్. 14 మ్యాచుల్లో 4 విజయాలు మాత్రమే దక్కించుకున్న చెన్నై 8 పాయింట్లతో తొమ్మిది స్థానంలో నిలిచింది.

    చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో రాజస్థాన్ అదరగొట్టింది. 151 పరుగుల లక్ష్యాన్ని ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో 18 పాయింట్లతో సెకండ్ ప్లేసుకి దూసుకెళ్లింది. దీంతో.. ఫైనల్ వెళ్లడానికి రెండు అవకాశాలు దక్కించుకుంది. లక్నో మూడో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 59 పరుగులు ; 8 ఫోర్లు, 1 సిక్సర్), రవిచంద్రన్ అశ్విన్ (23 బంతుల్లో 40 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకి రెండు వికెట్లతో సత్తా చాటాడు. సిమర్ జీత్, మొయిన్ అలీ, మిచెల్ శాంట్నర్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలో​కి దిగిన రాజస్తాన్‌ రాయల్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 16 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన బట్లర్‌.. సిమర్‌జీత్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆదిలోనే వికెట్ కోల్పోయిన రాజస్తాన్ ఇన్నింగ్స్ ని యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ఆదుకున్నారు. ఈ ఇద్దరి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

    యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడితే.. సంజూ శాంసన్ మాత్రం చాలా నిదానంగా ఆడాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ రెండో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని శాంట్నర్ విడదీశాడు. 67 పరుగులు వద్ద రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన శాంసన్‌.. శాంట్నర్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. రాజస్తాన్‌ పడిక్కల్‌ రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన పడిక్కల్‌.. మొయిన్‌ అలీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో.. 76 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది రాజస్తాన్.

    ఓ వైపు వికెట్లు పడుతున్నా.. యశస్వి తన జోరును ఆపలేదు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత క్రీజులో ఎంతో సేపు నిలవలేదు. 59 పరుగులు చేసిన జైస్వాల్ ప్రశాంత్ సోలంకి బౌలింగ్ లో పతిరణకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే హెట్మేయర్ (6) కూడా ప్రశాంత్ సోలంకి బౌలింగ్ లోనే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 112 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆఖర్లో అశ్విన్, పరాగ్ మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ విజయం దక్కించుకుంది. అశ్విన్ మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు.

    అంతకుముందు.. చెన్నై సూపర్ కింగ్స్ సాధారణ లక్ష్యాన్ని మాత్రమే సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. మొయిన్ అలీ (57 బంతుల్లో 93 పరుగులు ; 13 ఫోర్లు, 3 వికెట్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోని (28 బంతుల్లో 26 పరుగులు ; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదన్పించాడు. మిగతా వారు అంతగా రాణించలేదు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, మేకాయ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. అశ్విన్, బోల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Chennai Super Kings, IPL 2022, MS Dhoni, Rajasthan Royals, Ravichandran Ashwin, Sanju Samson

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు