IPL 2022 RR VS CSK LIVE SCORE UPDATES CHENNAI SUPER KINGS WON THE TOSS AND OPTED TO BAT FIRST SRD
IPL 2022 - RR vs CSK : టాస్ గెలిచిన చెన్నై.. RRకి గుడ్ న్యూస్.. జట్టులోకి రూ.8.5 కోట్ల స్టార్ ఆటగాడు..
IPL 2022 - RR vs CSK
IPL 2022 - RR vs CSK : రాజస్థాన్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. గెలవకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక, కనీస పరువు దక్కించుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2022 సీజన్ ప్లే ఆఫ్స్ కథ తారా స్థాయికి చేరుకుంది. 10 జట్లతో ఆరంభమైన ఐపీఎల్ 2022 ఊహకందని ట్విస్ట్ లతో దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఇంకో మూడు మ్యాచ్ లే మిగిలి ఉండగా.. మరో ఇంట్రెస్టింగ్ పోరుకు కాసేపట్లో తెరలేవనుంది. ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. రాజస్థాన్ రాయల్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక, శివమ్ దూబే స్థానంలో రాయుడు తిరిగి జట్టులో చేరాడు. ఇక, రాజస్థాన్ రాయల్స్ కు గుడ్ న్యూస్. జేమ్స్ నీషమ్ స్థానంలో పవర్ హిట్టర్ రూ.8.5 కోట్ల స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్మేయర్ తిరిగి జట్టులో చేరాడు.రాజస్థాన్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. గెలవకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక, కనీస పరువు దక్కించుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ప్లేఆఫ్స్ చేరకుండానే మరోసారి ఈ మెగా టోర్నమెంట్ నుంచి వైదొలగింది. ఇవ్వాళ్టి మ్యాచ్ నామమాత్రమే. రాజస్థాన్ రాయల్స్‌పై గెలిస్తే పాయింట్లు డబుల్ డిజిట్‌కు చేరుతాయి. 10 పాయింట్లతో సీజన్‌కు గడ్‌బై చెప్పే వీలు ఉంటుంది.
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఒకటి రెండు ప్రదర్శనలు తప్ప జట్టు సమిష్టిగా రాణించింది లేదు. డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ మోస్తరు ప్రదర్శన చేస్తున్నారు. ఈ ఇద్దరు ఓపెనర్లు మరోసారి మంచి శుభారంభాన్ని అందిస్తే చెన్నై మంచి స్కోరు సాధించగలుగుతోంది.మొయిన్ అలీ, రాయుడు మెరుపులు మెరిపించాల్సి ఉంది.
గత మ్యాచులో జగదీషన్ ఆకట్టుకున్నాడు. అయితే.. వేగంగా ఆడాల్సి ఉంది. ధోని ప్రదర్శన ఫర్వాలేదన్పిస్తున్నా.. అది జట్టుకు ఉపయోగపడటం లేదు. బౌలింగ్ లో ముఖేష్ చౌదరి, సిమర్జిత్ సింగ్ ఆకట్టుకుంటున్నారు. మతీష పతిరణ తన వేగం పవరెంటో చూపాల్సి ఉంది. స్పిన్ విభాగంలో మిచెల్ శాట్నర్, మొయిన్ అలీ కీలకం కానున్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో చాలా బలంగా కన్పించింది. రాయల్‌గా ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ జట్టు. ఈ మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా ప్లేఆఫ్స్‌లో ప్రవేశించడం మాత్రం ఖాయం. 13 మ్యాచ్ల్లలో ఎనిమిదింట్లో ఘన విజయాన్ని సాధించింది. 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గెలిస్తే రెండో స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో.. ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయ్.
బ్యాటింగ్ లో జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్ లో ఉన్నారు. గత మూడు మ్యాచుల్లో విఫలమైనప్పటికీ బట్లర్ మోస్ట్ డేంజరస్ బ్యాటర్. రియాన్ పరాగ్, హెట్మెయర్ మెరుపులు మెరిపించడానికి సిద్ధం.
ఇక బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణలతో పేస్ బౌలింగ్ స్ట్రాంగ్ గా కన్పిస్తోంది. చాహల్, అశ్విన్ వంటి టాప్ క్లాస్ స్పిన్నర్లు ఆ జట్టు సొంతం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.