బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ సాధారణ లక్ష్యాన్ని మాత్రమే సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. మొయిన్ అలీ (57 బంతుల్లో 93 పరుగులు ; 13 ఫోర్లు, 3 వికెట్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ధోని (28 బంతుల్లో 26 పరుగులు ; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదన్పించాడు. మిగతా వారు అంతగా రాణించలేదు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, మేకాయ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. అశ్విన్, బోల్ట్ చెరో వికెట్ దక్కించుకున్నారు.టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకి ఆదిలోనే షాక్ తగిలింది. ఈ సీజన్ లో తడబడ్డ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ మరోసారి నిరాశపర్చాడు. 2 పరుగులు చేసిన గైక్వాడ్ బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయినప్పటికీ సీఎస్కే వెనక్కి తగ్గలేదు. ముఖ్యంగా మొయిన్ అలీ ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో డేవాన్ కాన్వే అతనికి సహకరించాడు.
బోల్ట్ వేసిన ఆరు ఓవర్ లో తన విశ్వరూపం చూపాడు మొయిన్ అలీ. ఆ ఓవర్ లో 6,4,4,4,4,4 వరుసగా బౌండరీల వర్షం కురిపించాడు. ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. 85 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 16 పరుగులు చేసిన కాన్వే.. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీ రూపంలో ఔటయ్యాడు. దీంతో.. 83 పరుగుల విలువైన భాగస్వామ్యానికి ఎండ్ కార్డ్ పడింది. ఇక, ఇక్కట్నుంచి సీఎస్కే ఇన్నింగ్స్ కాస్త తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 8 పరుగుల వద్ద సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది.
1పరుగు చేసిన జగదీశన్.. మేకాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే 95 పరుగుల వద్ద సీఎస్కే నాలుగో వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన రాయుడు.. చాహల్ బౌలింగ్‌లో పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక, వరుస వికెట్లు పడి కష్టాల్లో పడ్డ చెన్నై ఇన్నింగ్స్ ని అలీ, ధోని ఆదుకున్నారు. ఇద్దరు ఆచి తూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో.. ఐదో వికెట్ కు 50 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు.
అయితే..ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని చాహల్ విడదీశాడు. చాహల్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన ధోని బట్లర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే మొయిన్ అలీ (57 బంతుల్లో 93 పరుగులు ; 13 ఫోర్లు, 3 వికెట్లు) కూడా పెవిలియన్ బాట పట్టాడు. మేకాయ్ బౌలింగ్ లో రియాన్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఓ దశలో అలీ మెరుపులతో.. భారీ స్కోరు దిశగా సాగిన సీఎస్కే ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. దీంతో... సాధారణ లక్ష్యాన్ని మాత్రమే రాజస్థాన్ ముందుంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.